ప్రచురణ తేదీ : Thu, Apr 26th, 2018

ఎన్టీఆర్ బయోపిక్ కు అయన దర్శకత్వం..?

విశ్వ విఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ నందమూరి తారకరామారావు గారి జీవిత గాధను ప్రస్తుతం అయన తనయుడు నందమూరి బాలకృష్ణ తెరెకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం ఇటీవల అతిరథ మహారథుల సమక్షంలో ఎంతో వైభవంగా జరిగింది. అయితే ఎందుకో, ఏమిటో తెలియదుగాని వున్నట్లుండి హఠాత్తుగా నిన్న దర్శకుడు తేజ మీడియా కి ఒక ప్రకటన విడుదల చేస్తూ, తాను ఈ చిత్ర దర్శకత్వ బాధ్యతల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తాను ఈ చిత్రానికి న్యాయం చేయలేను అని అనిపించింది, అందుకే తప్పుకుంటున్నాను అన్నారు.

అయితే తాను ఎన్టీఆర్ వీరాభిమానినని, అలాగే బాలకృష్ణ అంటే కూడా తనకు అమితమైన గౌరవమని అన్నారు. కాగా ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారా అనేదానిపై ఒక పెద్ద చర్చ మొదలయింది. ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రముఖులైన వారిలో దర్శక దిగ్గజం కే. రాఘవేంద్ర రావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించొచ్చని అంటున్నారు. అంతే కాదు పూరి జగన్నాథ్, కృష్ణ వంశి, పి వాసు తదితరుల పేర్లు కూడా వినిపిస్తున్నప్పటికీ,

సీనియర్ దర్శకులు అందునా బాలయ్యతో, ఎన్టీఆర్ తోమంచి అనుబంధం, మంచి సినిమాలు తీసిన చరిత్ర వున్న రాఘవేంద్రరావుని ఎక్కువగా వరించే అవకాశం కనపడుతోందట. కాగా ఈ విషయమై త్వరలో ఎవరు దర్శకులు అనేది త్వరలో అధికారిక ప్రకటన విడుదలచేస్తామని చిత్ర యూనిట్ అంటోంది. అప్పటివరకు తప్పక వేచివుండవలసిందే మరి…..

Comments