ప్రచురణ తేదీ : Jan 23, 2017 1:50 PM IST

అక్కడ అమ్మాయిలు అబ్బాయిలను అద్దెకు తెచ్చుకుంటున్నారు….!

robo-girl
ఏ దేశంలోనైనా వయస్సు వచ్చిన యువతీయువకులకు పెళ్లి చేసి తమ భాద్యత తీర్చుకోవాలని తల్లితండ్రులు అనుకోవడం మాములే. కానీ ఇప్పటి యువతీయువకులు అంత త్వరగా సంసారం భాద్యతల్లోకి వెళ్ళడానికి సిద్దపడడంలేదు. కానీ తల్లితండ్రులు ఒత్తిడి చేయడంతో వాళ్లకు ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకుంటున్నారు. కానీ చైనాలో అమ్మాయిలు మాత్రం తల్లితండ్రుల నుండి ఒత్తిడి తప్పించుకోవడాని ఒక ఉపాయం ఆలోచించారు. అక్కడి తల్లితండ్రులు పెళ్లి చేసుకోవాలని అమ్మాయిలపై ఒత్తిడి తెస్తుంటే వాళ్ళు ఆ పెళ్లి నుండి తప్పించుకోవడానికి బాయ్ ఫ్రెండ్లను అద్దెకు తెచ్చుకుని తల్లితండ్రులకు పరిచయం చేస్తున్నారు.

చైనా అమ్మాయిలు చాలామంది తమ ఇంటికి దూరంగా నగరాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. దాంతో ఆ అమ్మాయిలు పెళ్లి చేసుకోవాలని తల్లితండ్రులు ఒత్తిడి తెస్తున్నారు. తాము సంబంధాలు చూస్తామని, లేదంటే ఎవరినైనా ప్రేమిస్తే చెప్పండి వాళ్ళతోనే పెళ్లి చేస్తామని తల్లితండ్రులు చెప్తున్నారు. దాంతో పెళ్లి ఇష్టం లేని అమ్మాయిలు పెద్దల ఒత్తిడి నుండి తప్పించుకోవడానికి బాయ్ ఫ్రెండ్స్ ను అద్దెకు ఇచ్చే ఏజెన్సీలను సంప్రదిస్తున్నారు. అందంగా, మంచి పర్సనాలిటీ తో ఉండే అబ్బాయిలు డబ్బులు తీసుకుని అమ్మాయిలకు బాయ్ ఫ్రెండ్ లా నటిస్తారు.

నకిలీ బాయ్ ఫ్రెండ్ ను పొందాలంటే అమ్మాయిలు 10 నుండి 15 వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది అయినా అమ్మాయిలు మాత్రం వెనుకంజ వేయట్లేదు. ఒక్కసారిగా అపరిచిత వ్యక్తిని ఇంటికి తీసుకెళ్తే తల్లితండ్రులు అనుమానించే అవకాశం ఉండడంతో అమ్మయిలు ముందు అబ్బాయిల వివరాలు తెలుసుకోవడానికి రకరకాల ప్రశ్నలు వేస్తున్నారు. అందుకే అద్దెకు తీసుకున్న బాయ్ ఫ్రెండ్ తో ముందుగానే పరిచయం పెంచుకుని కొద్దిరోజులు అవసరమన్న వ్యక్తిగత వివరాలను వారితో చర్చించి ఆ తరువాతే వాళ్ళను ఇంటికి తీసుకెళ్తున్నారు.

Comments