ప్రచురణ తేదీ : Jan 1, 2017 1:14 AM IST

కొత్త సంవత్సరం సందర్భంగా అందరినీ నరకండి.. చంపండి.. అంటున్న ఉగ్రవాదులు

terrorest
ఉగ్రవాద సంస్థ బోకోహరాం చీఫ్ అబూ బకర్ షెకావు దారుణమైన పిలునిచ్చాడు. అతను తాజాగా విడుదల చేసిన ఒక వీడియో సంచలనం సృష్టిస్తుంది. ఆ వీడియోలో ‘చంపండి.. నరకండి.. నరమేధం సృష్టించండి.. కిడ్నాప్ లు చేయండి.. ఎక్కడపడితే అక్కడ బాంబు లు పెట్టండి’ అని పిలుపునిచ్చాడు. అయితే గతవారం నైజీరియా అధ్యక్షుడు మహమ్మద్ బుహారీ చేసిన ఒక ప్రకటనలో బోకోహరాం ఉగ్రవాదులను తరిమి వేసినట్లుగా తెలిపారు. ఉగ్రవాదులు పారిపోయారని, వారు దాక్కొనేందుకు కూడా ఎక్కడ చోటులేదని అన్నారు.

అయితే ఇప్పుడు తాజాగా బోకోహరాం తీవ్రవాద సంస్థ అధ్యక్షుడు అబూ బకర్ విడుదల చేసిన వీడియోలో ‘నేనున్నాను.. క్షేమంగా ఉన్నాను.. సజీవంగా ఉన్నాను.. యుద్ధం ఇప్పుడు మొదలైంది’ అంటూ ప్రకటించాడు. గతంలో కూడా మూడు సార్లు నైజీరియా సైన్యం బకర్ ను చంపినట్లు పేర్కొంది. ఆ మూడు సార్లు అబూ బకర్ మళ్ళీ దర్శనం ఇచ్చాడు. డిసెంబర్ 29న యూట్యూబ్ లో పోస్ట్ చేసిన వీడియో లో ‘నైజీరియాలో ఇస్లామిక్ రాజ్య స్థాపనే తమ ధ్యేయమని అన్నాడు. అందరినీ చంపేయండి.. అన్ని చోట్ల బాంబులు పెట్టండి అని పిలుపునిచ్చాడు. ‘మిమ్మల్ని అందరినీ చంపేయాలి.. మూకుమ్మడిగా హత్య చేయాలి.. కిడ్నాప్ చేయాలి’ అంటూ తీవ్రంగా హెచ్చరించాడు.

Comments