ప్రచురణ తేదీ : Fri, Jan 13th, 2017

శునకాలే ఉగ్రవాదుల ఆయుధాలు..రిపబ్లిక్ వేడుకలే లక్ష్యం..!

terrist
ప్రపంచంలో రోజురోజుకీ ఉగ్రవాద చర్యలు మితిమీరిపోతున్నాయి. నిఘా వర్గాల ఊహకు కూడా అందకుండా ఉగ్రవాదులు విధ్వంస రచనలు చేస్తున్నారు. జనవరి 26 దేశవ్యాప్తంగా జరగబోయో రిపబ్లిక్ వేడుకలు లక్ష్యంగా ఉగ్రవాదులు విధ్వంసానికి ప్లాన్ చేస్తున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. దీనికోసం ఉగ్రవాదులు పెంపుడు జంతువులను ఆసరాగా ఉపయోగించుకునే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి.పెంపుడు జంతువులైన కుక్కలు, పిల్లులను ఉపయోగించి ఉగ్ర కుట్రలకు పాల్పడే అవకాశం ఉండడంతో నిఘా వర్గాలు కేంద్ర హోమ్ శాఖని అప్రమత్తం చేశాయి.

దేశంలో జనవరి 26 న జరగనున్న రిపబ్లిక్ వేడుకలలో ఢిల్లీ, ముంబయి, హైదరాబాద్ వంటి నగరాలలో ఉగ్రవాదులు కుక్కలు, పిల్లులు వంటి వాటిని సూసైడ్ బాంబర్ లుగా ఉపయోగించి విధ్వంసం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో కేంద్ర హోమ్ శాఖ అప్రమత్తమైంది.ఈ నేపథ్యంలో నిఘావర్గాలు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేస్తున్నాయి. రిపబ్లిక్ వేడుకలో భారీ గా భద్రతని ఏర్పాటు చేసుకోవాలని సూచించాయి. శీతాకాలం కావడంతో పెంపుడు జంతువులకు ఉన్ని దుస్తులు వేస్తారు.ఉన్నిదుస్తుల కింద బాంబులు అమర్చి అవి తమ లక్ష్యాలకు చేరువకగానే ఉగ్రవాదులు రిమోట్ సాయంతో బాంబులను పేల్చుతారు.

Comments