ప్రచురణ తేదీ : Dec 7, 2017 10:18 PM IST

టెంప‌ర్ ద‌యా గాడు అక్క‌డెలా ఉన్నాడు?

దండ‌యాత్ర .. ద‌యాగాడి దండ‌యాత్ర‌! అంటూ `టెంప‌ర్`లో చిత‌కేశాడు ఎన్టీఆర్‌. ఆ సినిమాలో పూరి రాసిన పంచ్ డైలాగుల‌కు జ‌నం జేజేలు ప‌లికారు. ఎన్టీఆర్ అభిమానులైతే ఎమోష‌న్‌లో థియేట‌ర్ కుర్చీలే విరిచేశారు. అంత‌టి క్రేజీ డైలాగులున్న సినిమా కాబ‌ట్టే, టెంప‌ర్‌ని రోహిత్ శెట్టి క్యాచ్ చేశాడు. ఎన్టీఆర్‌లోని ఎన‌ర్జీ లెవ‌ల్స్‌కి యాప్ట్‌గా అనిపించే ర‌ణ్‌వీర్ సింగ్‌ని క‌థానాయ‌కుడిగా ఎంపిక చేసుకుని ప‌ని మొద‌లెట్టేశాడు ఎపుడో. ఇప్పుడు ఆ ప‌ని ఓ కొలిక్కి వ‌చ్చింది. స్క్రిప్టు రెడీ అయ్యింది. ఇక సెట్స్‌కెళుతున్నామ‌ని ప్ర‌క‌టించాడు. జ‌న‌వ‌రిలో సెట్స్‌కెళ్లి, 2018 దీపావ‌ళి కానుక‌గా రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నాడు. ఈలోగానే ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ని లాంచ్ చేశారు. టైటిల్‌ని ప్ర‌క‌టించేశారు.

సంగ్రామ్ భ‌లేరావ్ అలియాస్‌ `శింబా` అంటూ టైటిల్‌ని వెల్ల‌డించారు. ర‌ణ్‌వీర్ వేషాల‌కు త‌గ్గ‌ట్టే `శింబా` టైటిల్ యాప్ట్‌గా ఉంద‌న్న టాక్ వ‌చ్చింది. ధ‌ర్మ‌ప్రొడ‌క్ష‌న్స్ (క‌ర‌ణ్ జోహార్‌) – రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌తో క‌లిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో టైటిల్ పాత్ర‌కు ర‌ణ‌వీర్ ఏమేర‌కు న్యాయం చేస్తాడో చూడాలి. తార‌క్‌కి త‌గ్గ‌ట్టు మ‌లిచిన టెంప‌ర్‌మెంట్‌ని, ర‌ణ్‌వీర్ కోసం రోహిత్ శెట్టి మ‌లిచాడా లేదా? అన్న‌ది తెలియాలంటే 2018 చివ‌రి వ‌ర‌కూ వేచి చూడాల్సిందే.

Comments