దుబాయ్ లో తెలుగు మహిళ నరకం..రాత్రి అయితే చాలు : వీడియో

డబ్బు సంపాందించి కుటుంబాన్ని పోషించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల్లోని కొందరు యువతులు, యువకులు విదేశాల్లోకి వెళ్లి ఎదో ఒక పని చేసి తల్లి దండ్రులకు డబ్బు పంపాలని అనుకుంటారు. అయితే దుబాయ్ కి వెళ్లిన వాళ్ళు మాత్రం నరకాన్ని చూస్తున్నారు. డబ్బు సంపాదించడం తర్వాత సంగతి కానీ అనుక్షణం అక్కడి వారి చేతుల్లో నరకాన్ని చూస్తున్నారు. ఇప్పుడు అదే తరహాలో మరొక మహిళ తన యజమానులు చేతుల్లో నరకాన్ని అనుభవిస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా తన ఆవేదనను తెలిపింది. గత ఏడాది డిసెంబర్ లో కన్సల్టెన్సీ మాటలు నమ్మి దుబాయ్ కి వెళ్ళింది తెలుగు మహిళ.

60 వేల రూపాయలను తీసుకొని దుబాయ్ పంపిన కన్సల్టెన్సీ వారు ఆమెను దుబాయిలోని షార్జాహ్‌లో ఓ ఇంట్లో పనిమనిషిగా చేర్చారు. దీంతో అక్కడి యజమానుల తీరు ఏ మాత్రం బాగోలేదని, అనుక్షణం నరకం చూపిస్తున్నారని వాబోయింది. అలాగే కన్సల్టెన్సీ అధికారులు కూడా మరో లక్ష రూపాయలను తన నుంచి డిమాండ్ చేస్తున్నారని చెప్పింది. ముఖ్యంగా తాను పనిచేస్తున్న ఇంట్లోని యజమానులు ఘోరంగా కొడుతున్నారని ఇండియాకు వెళ్ళిపోతాను అంటే లక్ష రూపాయలు ఇచ్చి వెళ్ళమంటున్నారని చెప్పింది. అలాగే తనతో పాటు ఉన్న మరో ఫిలిప్పియన్ అమ్మాయిలను కూడా కొడుతున్నారని ఆ యువతి చెప్పసాగింది. అంతే కాకుండా తన యజమాని కొడుకు రోజు రాత్రి తలుపు కొట్టేవాడని తియ్యకుంటే ఉదయం కొట్టేవాడని వాబోయింది. ఎలాగైనా ఈ నరకం నుంచి తనను రక్షించాలని అడ్రస్ చెబుతూ.. వెంటనే ఇండియాకు రప్పించాలని వివరించింది.

Comments