ప్రచురణ తేదీ : Dec 1, 2017 9:04 AM IST

సినిమాల్లోనే కాదు .. టివి రంగంలో వేధింపులు ఎక్కువే- ఓ హీరోయిన్ ?

సినిమా రంగంలో హీరోయిన్స్ పై వేధింపులు ఉన్నాయంటూ ఇప్పటికే పలువురు హీరోయిన్స్ స్పందించిన విషయం సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే సినిమా రంగంలోనే కాదు టివి రంగంలో కూడా కాస్టింగ్ కౌచ్ ఉందంటూ సంచలనం రేపుతోంది .. ఓ టివి నటి. పైగా ఆమె సాక్ష్యాలతో సహా ఈ విషయాన్నీ బయట పెట్టడం దుమారం రేపుతోంది. టివి నటిగా మంచి ఇమేజ్ తెచ్చుకుంటున్న సులగ్న ఛటర్జీ ఈ వ్యవహారాన్ని వాట్స్ అప్ లో షేర్ చేసింది. ఓ దర్శకుడు తనను లైంగికంగా కావాలని వేధిస్తున్నాడని, ఓ మధ్యవర్తి ద్వారా చేసిన ప్రయత్నాలను ఆమె బయట పెట్టింది. టివి సీరియల్స్ లో అవకాశం ఇస్తానని, ఫుల్ పేమెంట్ అయినా తర్వాతే కాంప్రమైజ్ అవ్వొచ్చు అంటూ మధ్యవర్తి ద్వారా సదరు దర్శకుడు బేరసారాలు జరిపాడని, ఆ విషయం తెలిసి తాను తిరస్కరించింది. కాంప్రమైజ్ కావడం వల్ల వచ్చే అవకాశాలు తనకు వద్దని గట్టిగానే చెప్పింది. అయితే ఆ దర్శకుడు ఎవరన్నా విషయం మాత్రం బయటపెట్టకపోవడం విశేషం.

Comments