ప్రచురణ తేదీ : Thu, Sep 14th, 2017

అమెరికాలో నల్గొండ డాక్టర్ దారుణ హత్య..!


అమెరికాలో స్థిరపడిన నల్గొండ జిల్లా డాక్టర్ అచ్యుత రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. అచ్యుతరెడ్డి అమెరికాలోని కేన్సాస్ రాష్ట్రంలో ఉంటున్నారు. ఓ దుండగుడు అచ్యుతారెడ్డిని కత్తితో దాడి చేయడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. అచ్యుతరెడ్డి సైకియాట్రిక్ డాక్టర్. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో 1986 లో ఆయన వైద్య విద్యని పూర్తి చేసారు. అనంతరం అమెరికా వెళ్లి స్థిరపడ్డారు.

ఆయన సొంత క్లినిక్ లో బుధవారం రాత్రి ఓ వ్యక్తితో గొడవ జరిగింది.ఈ గొడవలో దుండగుడు అచ్యుతరెడ్డి ని కత్తితో పొడవడంతో అక్కడే మృతి చెందారు. ఈ ఘటన జరిగిన కొద్ది సేపటి తరువాత పోలీస్ లు నిందితుడిని కంట్రీ క్లబ్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన పై తెలంగాణ మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించారు. అచ్యుతరెడ్డి మరణంపై ఆయన దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ఏదైనా సాయం కావాలంటే తమని సంప్రదించాలని ట్విట్టర్ లో కోరారు. అచ్యుత రెడ్డిని హత్య చేసిన వ్యక్తి ఓ రోగి అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అమెరికాలో భారతీయులపై దాడి జరుగుతున్నా ఘటనలు తరచుగా జరుగుతున్నాయి.

Comments