ప్రచురణ తేదీ : Nov 10, 2017 9:22 PM IST

నెక్స్ట్ సమరానికి కోహ్లీ సేన సిద్ధం.. హార్దిక్ పాండ్యా లేడు

గత కొన్ని నెలలుగా టీమ్ ఇండియా విశ్రాంతి లేకుండా బిజీ షెడ్యూల్ తో గడుపుతోంది. అంతే కాకూండా వరుస విజయాలను కూడా దక్కించుకుంటోంది. రీసెంట్ గా న్యూజిలాండ్ తో ఆడిన ఇండియా వన్డే మరియు టీ20 సిరీస్ ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ మరో టెస్ట్ సిరీస్ కు రెడీ అయ్యింది. ఈ నెల 16 నుంచి శ్రీలంకతో టెస్ట్ సిరీస్ ను స్టార్ట్ చేయనుంది. మూడు టెస్టులు ఆడబోతున్న భారత్ జట్టు సభ్యుల పేర్లను బిసిసిఐ సెలెక్షన్ కమిటీ ఈ రోజు తెలిపింది. వీరు మొదటి రెండు టెస్టులకు మార్పులు లేకుండా ఆడే అవకాశం ఉంది. మళ్లీ చివరి టెస్టులు సెలెక్షన్ కమిటీ కొన్ని మార్పులు చేయనున్నట్లు వివరించింది. ఇకపోతే ప్రస్తుతం బెస్ట్ ఆల్ రౌండర్ గా రానిస్తోన్న హార్దిక్ పాండ్యాకు బోర్డు విశ్రాంతిని ఇచ్చింది.

ప్లేయర్స్ వివరాలు:

విరాట్ కోహ్లీ (కెప్టెన్‌)
అజింక్యా ర‌హానె (వైస్ కెప్టెన్‌)
కేఎల్ రాహుల్‌
వృద్ధి మాన్ సాహా (వికెట్ కీప‌ర్‌)
ముర‌ళీ విజ‌య్‌
శిఖ‌ర్ ధావ‌న్
చ‌టేశ్వ‌ర పుజారా
రోహిత్ శ‌ర్మ‌
అశ్విన్‌
ర‌వీంద్ర జ‌డేజా
కుల్దీప్ జాద‌వ్
మొహ‌మ్మ‌ద్ షమి
ఉమేశ్ యాద‌వ్
భువ‌నేశ్వ‌ర్ కుమార్
ఇషాంత్ శ‌ర్మ‌

Comments