క్రీడాకారిణిని ఆటలకని తీసుకెళ్లి..!!

girl
రాజస్థాన్ లోని ఓ స్కూల్ లో ఫిజికల్ ట్రైనింగ్ టీచర్ గా పనిచేస్తున్న అబ్దుల్ హనీఫ్ అనే వ్యక్తి దారుణానికి ఒడికట్టాడు. ఓ ప్రభుత్వ పాఠశాలలో అతడు ఫిజికల్ ట్రైనింగ్ టీచర్ గా పనిచేస్తున్నాడు. అదే స్కూల్ లో హ్యాండ్ బాల్ జట్టు లో 16 ఏళ్ల బాలిక క్రీడల్లో పాల్గొంటుంది. ఆ బాలికపై అతడు అత్యాచారానికి పాల్పడడంతో ఈ ఘటన సంచలనంగా మారింది.

వివిధ నగరాల్లో జరిగిన హ్యాండ్ బాల్ టోర్నీలలో ఆమె పాల్గొనేది. టోర్నీలు జరిగేటప్పడు ఆమెతో పాటు హనీఫ్ కూడా వెళ్ళేవాడు. ఈ సందర్భంగా ఆమెపై అనేకసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనితో అతని వేధింపులు తాళలేక ఆమె నిజం బయట పెట్టింది. హ్యాండ్ బాల్ టోర్నీ లో పాల్గొనడానికి వెళ్లినప్పుడు ఫేక్ డీటెయిల్స్ తో తనని హోటల్స్ కు తీసుకుని వెళ్లి అత్యాచారం చేసినట్లు ఆమె పోలీస్ లకు ఫిర్యాదు చేసింది. ఇలా తన పై 8 సార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు ఆమె వివరించడంతో పోలీసులు హనీఫ్ ని అరెస్ట్ చేసి ఆమెని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు.

Comments