ప్రచురణ తేదీ : Jan 19, 2017 2:44 PM IST

ఎన్టీఆర్ కి భారత రత్న వచ్చే ఛాన్స్ లేదు

ntr
నవరస నటనా సార్వభౌముడు గా తెలుగువారి ఖ్యాతిని ప్రపంచ స్థాయికి అందించిన ధీరుడు ఎన్టీఆర్. ఆయనకి ఈ దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలి అనేది ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్. కానీ ఆయన కి భారత రత్న సిఫార్సు చేస్తున్న తెలుగుదేశం పార్టీ కేవలం ఏడాది లో రెండే రోజులు ఆయన కోసం ఆయన కి భారత రత్న ఇవ్వడం కోసం తూతూ మంత్రంగా పోరాడుతోంది. జనవరి 18న ఎన్టీఆర్ 21వ వర్ధంతి సందర్భంగా ఆయనకు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది. ఇటీవలే మరణించిన తమిళనాడు సీఎం జయలలితకు భారతరత్న ఇవ్వాలంటూ తమిళనాడు ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పార్టీలో ఆమెకు బంధువులెవరూ లేకపోయినా అమ్మగా భావించిన నేతలే ఇందుకు కంకణం కట్టుకుని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తోంటే.. తెలుగుదేశం పార్టీ మాత్రం ఎలాంటి ప్రయత్నాలూ చేయడంలేదని ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఏటా కేవలం రెండు రోజులే “ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలి” అంటూ టీడీపీ నేతలు నినాదాలు చేయడమే ఇందుకు నిదర్శనం. ఎన్టీఆర్ జయంతి మే 28 – వర్ధంతి జనవరి 18. ఈ రెండు రోజులే టీడీపీ నాయకులు ఆ మహానేతకు భారతరత్న పై డిమాండ్ చేస్తుంటారు. ఆ తరవాత ఆ ఊసే ఎత్తరు! ఇంకా చెప్పాలంటే… ఆయన మరణానంతరం చేస్తున్నంత తీవ్రంగా కూడా ఇప్పుడు ఆ విషయంపై పోరాటం చేయడం లేదు.

Comments