ప్రచురణ తేదీ : Dec 4, 2017 8:06 PM IST

వైజాగ్ రేల్వే జోన్..పార్లమెంట్ నుంచి ఎంపీకి గుడ్ న్యూస్..!

వైజాగ్ రైల్వే జోన్ విషయంలో ఎంపీ రామ్మోహన్ నాయుడు చేసిన ప్రయత్నం ఫలించింది. వైజాగ్ రైల్వే జోన్ దిశగా తొలి అడుగు పడింది. విభజన హామీల్లో విశాఖ రైల్వే జోన్ కూడా ఒకటిగా ఉంది. ప్రత్యేక హోదా తోపాటు విశాఖ రైల్వే జోన్ హామీని కూడా నెరవేర్చాలని గతంలో వాడి వేడి చర్చ, నిరసనలు జరిగాయి. దీనితో ఎంపీలపై తీవ్రమైన ఒత్తిడి నెలకొంది. విశాఖకు రైల్వే జోన్ అంశాన్ని పార్లమెంట్ లో బిల్లు రూపంలో ప్రవేశపెట్టాలని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రయత్నించారు.

పార్లమెంట్ లో బిల్లు పెట్టె అవకాశం ఇవ్వాలని గతంలో రామ్మోహన్ నాయుడు స్పీకర్ కు లేఖ రాశారు. ఈ మేరకు లోక్ సభ సెక్రటేరియట్ నుంచి ఆయనకు బదులు అందింది. విశాఖ రైల్వే జోన్ పై ప్రవేట్ మెంబర్ బిల్లు పెట్టే అవకాశం ఇస్తున్నట్లు పార్లమెంట్ నుంచి రామ్మోహన్ నాయుడుకు లేఖ రావడం విశేషం. రైల్వే జోన్ చట్టం 2017 కింద బిల్లు ప్రతిపాదనకు లోక్ సభ రామ్మోహన్ నాయుడుకు అంగీకారం తెలిపింది. కాగా రామ్మోహన్ నాయుడు విశాఖ రైల్వే జోన్ కొరకు లోక్ సభలో ప్రవేట్ మెంబర్ బిల్లు ప్రవేశ పెట్టనున్నారు. ఈ బిల్లు ఆమోదం పొందితే మూడు నెలల్లో రైల్వే శాఖ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది.

Comments