ప్రచురణ తేదీ : Jan 20, 2017 2:56 PM IST

ఫాన్సీ నెంబర్ కోసం తెలుగు తమ్ముళ్ళ బెదిరింపులు ఇదెక్కడి విడ్డూరం ?

tdp
భూముల కోసం ఆస్తుల కోసం టెండర్ ల కోసం రాజకీయ నాయకులు బెదిరింపులకి దిగడం చూస్తాం కానీ ఈ రాజకీయ నాయకుడు ఏకంగా ఒక కారు ఫాన్సీ నెంబర్ కోసం ఏపీ లో రచ్చ చేసారు. ఎప్పుడూ మీడియా లో కనపడే యలమంచలి బాబూ రాజేంద్ర ప్రసాద్ అనుచరుల తీరు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. తమ నేత వాహనానికి కోరుకున్న ఒక ఫాన్సీ నెంబర్ ఒకసం ఒక వ్యక్తి అడ్డుపడుతున్నాడు అని తెలుసుకుని అతన్ని బెదిరించారు వాళ్ళు. ఉయ్యూరు ఆర్డీవో కార్యాలయంలో ఏపీ 16 డీడీ 7777 నెంబరు కోసం ఇరువురు పోటీ పడ్డారు.వీరిలో ఒకరు అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ అనుచరుడు ప్రవీణ్ కుమార్ కాగా.. మరొకరు వినయ్ కుమార్. ఫ్యాన్సీ నెంబరు కోసం వారిరువురూ పోటాపోటీ పడటం ఓకేఅయినా.. ఆ నెంబర్ ను సొంతం చేసేందుకు ఎమ్మెల్సీ అనుచరుడు బెదిరింపుల పర్వానికి తెర తీయటం గమనార్హం.

Comments