ప్రచురణ తేదీ : Thu, Feb 23rd, 2017

ఆ విషయంలో పవన్ పై కౌంటర్ వేసిన భరద్వాజ ?


పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పేరుతొ ప్రత్యేక హోదా విషయం పై పోరాడుతున్న విషయం తెలిసిందే. ఈ విషయం పై సీనియర్ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కామెంట్స్ చేసాడు. హోదా విషయంలో కేవలం స్టేట్ మెంట్లకే పరిమితమైతే సరిపోదని, రోడ్డుమీదికి వచ్చి పోరాటం మొదలు పెట్టాలని అయన అభిప్రాయం పడ్డారు. అంతే కాకుండా ఈ విషయం పై అయన కొన్ని సూచనలు చేసారు. పవన్ కొన్ని విషయాల్లో బాగానే మాట్లాడుతున్నారు కానీ, ఆ తరువాత ఆ విషయాలపై అయన ఎలాంటి ఫాలో చేయడం లేదని, అసలు ప్రత్యేక హోదా గురించి అయన ఎం కోరుకుంటున్నాడో అన్నది అర్థం కావడం లేదని అన్నారు. అసలు ప్రత్యేక హోదా కావాలని అంటున్నారా? ఆ విషయం గురించి అయన ఎలాంటి పోరాటం చేస్తాడనే విషయం పై కూడా ప్రజలకు క్లారిటీ ఇవ్వాలని అంటున్నాడు? అటు కేంద్రంతో ..ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరపాలని కూడా అన్నారు. కేవలం స్టేట్ మెంట్లకే పరిమితం కాకుండా కార్యాచరణ జరపాలని అంటున్నారు? మరి ఈ విషయం పై పవన్ కళ్యాణ్ ఏమంటాడో చూడాలి !!

Comments