ప్రచురణ తేదీ : Sun, Jan 22nd, 2017

తమిళనాడు ముఖ్యమంత్రికి చుక్కలు చూపించిన యువత

panniru-selvam
మొత్తం మీద జల్లి కట్టు ఆర్డినెన్స్ సంపాదించిన తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కి ఎక్కువసేపు సంతోషం నిలవలేదు. జల్లికట్టు క్రీడా ని మొదలు పెట్టడం కోసం మదురై జిల్లా అలంగనల్లూరు కి వచ్చిన తమిళ సీఎం మీద ఆందోళన జరిగింది. టెంపరరీ గా కాదు అనీ జల్లికట్టు కి శాశ్వత పరిష్కారం చూపాలి అని అక్కడి యువత పెద్ద ఎత్తున ఆందోళన కి దిగారు. ఇక దిండిగల్ లో జల్లికట్టును పన్నీరు సెల్వం ప్రారంభిస్తారని తమిళనాడు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. నాలుగు రోజుల పాటు సంఘటితమై జల్లికట్టుపై ఆర్డినెన్స్ సంపాదించుకున్నప్పటికీ, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఇప్పుడే గట్టి పట్టును ప్రదర్శించాలని తమిళనాట యువత నిర్ణయించుకుంది. జల్లికట్టును భవిష్యత్తులో ఎవరూ అడ్డుకోకుండా చర్యలు తీసుకుంటేనే పన్నీరు సెల్వంను సీఎంగా ఆదరిస్తామని, లేకుంటే ఎక్కడికి వెళ్లినా నిరసనలు తప్పవని పలువురు నినాదాలు చేశారు.

Comments