ప్రచురణ తేదీ : Sep 29, 2017 9:00 AM IST

దసరాకు గ్రీటింగ్ చెప్పిన సూర్య .. ఇంత డెప్తా బాసూ ?

తమిళ స్టార్ హీరో సూర్య . హీరోగా ఎలాంటి ఇమేజ్ తెచ్చుకున్నాడో .. మనిషిగా అంతకంటే గొప్ప పేరే తెచ్చుకున్నాడు. సమాజ సేవ విషయంలో అందరికంటే ముందుండే సూర్య .. ఈ రోజు విజయదశమి సందర్బంగా ఓ సందేశాన్ని సోషల్ మీడియా లో పోస్ట్ చేసారు. అయన గ్రీటింగ్ చెప్పిన విధానం అందరిని ఆలోచనలో పడేసింది .. నిజంగా సూర్య గ్రేట్ అబ్బా .. అని అంటున్నారు . ఇంతకీ అంత డెప్త్ గా సూర్య ఏమని సందేశం పెట్టాడో తెలుసా .. ” ఏ దుర్గా గర్భస్రావానికి గురికాకూడదని, ఏ సరస్వతి బడికి వెళ్లకుండా ఆగిపోకూడదని.. ఏ లక్ష్మి డబ్బుకోసం తన భర్తను ప్రాధేయ పడకూడదని .. ఏ పార్వతి కట్నానికి భలి కాకూడదని, ఏ సీత సైలంట్ గా బాధపడకూడదని , ఏ కాళీదేవికి ఫెయిర్నెస్ క్రీమ్ ఇవ్వకూడదని, ఈ నవమి సందర్బంగా ప్రార్థించండి అంటూ పోస్ట్ చేసారు. నిజంగా ఈ పోస్ట్ సూర్య పెట్టడంతో అందరు అభినదించడమే కాకుండా ఆలోచనలో పడ్డారు ? నిజంగా మీరు సూపర్ సూర్య సర్ !!

Comments