ప్రచురణ తేదీ : Fri, Sep 29th, 2017

తమన్ బీట్ కి .. దేవి శ్రీ షాక్.. హరీష్ మైండ్ బ్లాక్!

తెలుగు సినిమాలో కథ, కథనం ఎంత ప్రాణమో సంగీతం, పాటలు కూడా అంతే ప్రాణం. మొదటి నుంచి తెలుగు సినిమా ప్రేక్షకులు పాటలకి భాగా అలవాటు పడిపోయారు. ఎంతలా అంటే కొన్ని సినిమాల్లో పాటలు బాగున్నాయని హిట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. తెలుగు ప్రేక్షకులకి పాటలంటే అంత పిచ్చి. పాటలు లేని సినిమా అంటే వేస్ట్ అని సింపుల్ గా తీసేసే ప్రేక్షకుడు కూడా తెలుగు ఇండస్ట్రీలోనే ఉన్నాడు. మరి అలాంటి సంగీత ప్రియులని మెప్పించడానికి మొదటి నుంచి ఇప్పటి వరకు మ్యూజిక్ డైరెక్టర్స్ యుద్ధాలే చేస్తున్నారు. సినిమాలో పాటలు భాగుంటే, ఆడియో సూపర్ హిట్ అయితే ఆ మ్యూజిక్ డైరెక్టర్ కి వచ్చే క్రేజ్ మామూలుగా ఉండదు. అందుకే తెలుగు ఇండస్ట్రీలో హీరో, డైరెక్టర్ తర్వాత స్టార్ స్టేటస్ తెచ్చుకునేది మ్యూజిక్ డైరెక్టర్స్, మిగిలిన క్రాఫ్ట్స్ లో ఉన్న వాళ్ళకి లేనంత ఫేం, ఫ్రేం వీళ్ళకి ఉంటుంది.

అయితే ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకు అంటే. తాజాగా తెలుగులో ఇద్దరు స్టార్ హీరోల సినిల్మాలతో పాటు, ఓ యంగ్ హీరో సినిమా దసరా బరిలోకి వచ్చాయి. వీటికి మ్యూజిక్ డైరెక్టర్స్ గా ఉన్న ముగ్గురు తెలుగు, తమిళంలో మంచి క్రేజ్ ఉన్నవారే. ఈ ముగ్గురు సాంగ్స్ కి తెలుగు ఇండస్ట్రీలో మంచి ఫ్యాన్స్ ఉన్నారు. వీరిలో ముందుగా చెప్పుకోవాల్సింది దేవిశ్రీ ప్రసాద్. తెలుగులో ఇప్పుడున్న నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్. అయితే ఈ మధ్య కాలంలో అతని సినిమాల్లో ప్రేక్షకులు కోరుకునే రేంజ్ లో సంగీతం ఉండటం లేదనేది ప్రధాన ఆరోపణ, ఆరోపణ మాత్రమె కాదు వాస్తవం కూడా. కెరియర్ ప్రారంభంలో అద్బుతమైన సంగీతం అందిస్తూ తన మ్యూజిక్ తో హై స్టాండర్డ్ ఇచ్చిన సినిమాలు దేవి కెరియర్ లో చాలా ఉన్నాయి. అంతగా తెలుగు ప్రేక్షకుల దేవి సాంగ్స్ కి ఫిదా అయిపోయారు. అతనికి రాక్ స్టార్ అనే బిరుదు కూడా ఇచ్చేసారు. అయితే తాజాగా జై లవకుశకి అతను అందించిన మ్యూజిక్ కి గాని, పాటలకి గాని ఆడియన్స్ పెద్దగా కనెక్ట్ కాలేకపోయారు. గతంలో ఉన్నంత జోష్, రిథమ్ జై లవకుశలో లేదని దేవి శ్రీ పాటలని ఇష్టపడే వారి అభిప్రాయం.

ఇక హరీష్ జయరాజ్ గురించి చెప్పుకుంటే తమిళనాడులో ఇప్పుడున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో అతను కూడా ఒకడు. అతని నుంచి ఫీల్ గుడ్ సాంగ్స్ ఎన్నో తెలుగు ప్రేక్షకులు విన్నారు. ఈ జెనరేషన్ లో మెలోడీ సాంగ్ ఇవ్వాలంటే అది హరీష్ జయరాజ్ కే సాధ్యం అని అందరు అనే మాట. అయితే ఇప్పుడు హరీష్ సూపర్ స్టార్ మహేష్ స్పైడర్ సినిమాకి సంగీతం అందించారు. ఇందులో బ్యాగ్రౌండ్ స్కోర్ కి ఇచ్చిన ప్రాధాన్యత కూడా పాటలకి హరీష్ ఇవ్వలేదని అనిపిస్తుంది. సినిమాలో ఉన్న పాటల్లో ఎ ఒక్కటి ఆకట్టుకునే విధంగా లేకపోవడం గమనార్హం.

ఇక తమన్ గురించి చెప్పుకోవాలంటే. తెలుగు ఇండస్ట్రీలో చాలా తక్కువ టైంలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు. అయితే మొదటి నుంచి ఆయన నుంచి తెలుగు ప్రేక్షకులు అంతగా ఆకట్టుకునే పాటలు రావనే అపవాదు అతని మీద ఉంది. అతని పాటలు చాలా హార్డ్ గా ఉంటాయని కూడా అందరు అనే మాట. స్టార్ హీరో సినిమాలకి సంగీతం అందించిన, అతని మీద కాపీ కాట్ అనే ముద్ర బలంగా ఉంది. అతని పాటల కోసం ఉపయోగించే సంగీతం అంతా ఎవరివో పాటల నుంచి కాపీ చేసినవే అనే విమర్శ కూడా ఉంది. అయితే ఇప్పుడు స్టార్ హీరోల నుంచి అతనికి అవకాశాలు తగ్గిపోయాయి. ఇప్పుడు శర్వానంద్ హీరోగా వస్తున్న మహానుభావుడు సినిమాకి మ్యూజిక్ అందించాడు. అయితే ప్రస్తుతం మంచి ట్రెండ్ లో ఉన్న సాంగ్స్ ఇవే. తమన్ ఇప్పటి వరకు ఇవ్వని దారిలో సరికొత్తగా ఈ సినిమా కోసం పాటలు ఇచ్చాడనేది అందరి మాట. పాటలు చాలా ఆహ్లాదంగా, వినసొంపుగా ఉన్నాయని బయట వినిపిస్తున్న టాక్. కెరియర్ క్లోజ్ అయ్యే స్టేజి లో ఉన్న తమన్ నుంచి ఇలాంటి కొత్తదనం ఉన్న సాంగ్స్ రావడం నిజంగా గొప్ప విషయమే. సో.. ఈ దసరా బరిలో ముగ్గురు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో కేవలం తమన్ మాత్రమె మెప్పించాడు అనేది అందరి మాట.

Comments