ప్రచురణ తేదీ : Tue, Jan 10th, 2017

సుప్రీం vs తెలంగాణా ప్రభుత్వం .. ఏం గొడవ ఇది ?

suprem-court
తెలంగాణా రాష్ట్రానికి ఇప్పుడు ఊహించనంత పెద్ద కష్టం వచ్చి పడింది. తమ వాదన ని ఎవ్వరూ అర్ధం చేసుకోవడం లేదు అని వాపోతున్నారు ఆ తెలంగాణా ప్రభుత్వం వారు . కృష్ణ జలాల పంపిణీ ఇదివరకు లాగా కాకుండా సరికొత్త పంథా లో వేలం వెయ్యాలి అని తెలంగాణా సర్కారు సుప్రీం లో తన వాదన వినిపించింది. దీని మీద సుప్రీం నిర్ణయం తో టీజీ ప్రభుత్వం అస్సలు సంతోషంగా లేదు. తమ వాదనను కేంద్రం పట్టించుకోవటం లేదని.. సుప్రీం వినటం లేదని.. ఇక తాము ఎక్కడకు వెళ్లాలని ప్రశ్నిస్తోంది. నిజంగానే తెలంగాణ రాష్ట్రవాదనను కేంద్రం పట్టించుకోలేదా? సుప్రీం వినటం లేదా? అన్నప్రశ్నలపై సూటిగా.. స్పష్టంగా సమాధానాలు వెతికితే అసలు విషయం ఇట్టే అర్థమవుతుంది. ఇంతకీ ఈ లొల్లి ఎక్కడ షురూ అయ్యిందంటే.. ఉమ్మడిగా ఉన్న ఏపీ.. తెలంగాణలు రెండు రాష్ట్రాలు విడిపోవటంతో ఈ పంచాయితీ మొదలైందని చెప్పాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావటంతో కృష్ణా జలాల్ని ఇప్పటివరకూ పంచిన రీతిలో కాకుండా.. మిగిలిన భాగస్వామ్య పక్షాలన్నింటకి కలిపి కొత్తగా కేటాయింపులు జరపాలన్నది తెలంగాణ రాష్ట్ర వాదన. దీనిపై బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు ఇస్తూ.. విభజన నేపథ్యంలో మరోసారి కేటాయింపులు జరపాలని కోరటం సరి కాదని.. ఏ రాష్ట్రమైతే రెండుగా విడిపోయిందో.. వారికి చెందిన వాటానే పంచాలని పేర్కొంది. దీనిపై తెలంగాణ రాష్ట్రం అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంను ఆశ్రయించింది. దీనిపైవిచారించిన అత్యున్నత న్యాయస్థానం బ్రిజేశ్ కుమార్ తీర్పును సమర్థించటమే కాదు.. తెలంగాణ వాదనను తప్పుపట్టింది.

Comments