ప్రచురణ తేదీ : May 22, 2018 9:21 PM IST

సూపర్ స్టార్ కాలాకు లైన్ క్లియర్ అయినట్టే ?


సూపర్ స్టార్ రజని కాంత్ హీరోగా నటిస్తున్న కాలా సినిమా విడుదలకు మార్గం సుగమం అయింది. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జూన్ లో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. రజని సరసన హ్యూమా ఖురేషి నటిస్తున్న ఈ సినిమా ముంబై మాఫియా నేపథ్యంలో సాగుతుందని ఈ చిత్రంలో రజని మాఫియా లీడర్ పాత్రలో కనిపిస్తున్నాడట. కబాలి సినిమాతో సంచలనం రేపిన పా రంజిత్ దర్శకత్వంలో రజని కాంత్ నెక్స్ట్ సినిమా చేయడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే బిజినెస్ వర్గాల్లో సంచలనం రేకెత్తిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు.

Comments