ప్రచురణ తేదీ : Tue, Aug 8th, 2017

వీడియో : స్టన్నింగ్ క్యాచ్.. వారేవా అనాల్సిందే..!

ఇలాంటి అద్భుతాలు క్రికెట్ లో అరుదుగా జరుగుతుంటాయి. క్రికెట్ లో ఆటలో ఉండే మజానే వేరు. దానికి తోడు ఇలాంటి అద్భుతాలు జరిగితే అభిమానులకు మరింత కిక్కు ఇస్తుంది. మైదానం నలు వైపులా చురుకుగా కదులుతూ అద్భుతమైన ఫీల్డింగ్ ని కలబరిచే ఆటగాళ్లు అరుదుగా ఉంటారు. మాజీ క్రికెటర్లు జాంటీ రోడ్స్, మహమ్మద్ కైఫ్ ఆకోవకు చెందిన వారే.

ఈ తరం క్రికెటర్ లలో సురేష్ రైనా, రవీంద్ర జడేజాలు చక్కటి ఫీల్డింగ్ ని కనబరుస్తున్నారు. కాగా ప్రస్తుతం కరీబియన్ క్రికెట్ లీగ్ లో భాగంగా టి 20 మ్యాచ్ లు జరుగుతున్నాయి. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పాట్రియాట్స్, గయానా అమేజాన్ వారియర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో సబ్స్టిట్యూట్ గా వచ్చిన ఫాబిన్ అలెన్ అనే ఆటగాడు 10 అడుగుల దూరం నుంచి పరిగెత్తుకుంటూ గాలిలోకి డైవ్ చేసి క్యాచ్ అందుకున్న విధానం అద్భుతమనే చెప్పాలి. ఈ క్యాచ్ ని చోసిన అభిమానులు క్రికెట్ చరిత్రలోనే గొప్ప క్యాచ్ చూశామని అంటున్నారు.

Comments