ప్రచురణ తేదీ : Thu, Sep 14th, 2017

సునీల్ మరల బంతిలా మారిపోతున్నాడు! త్రివిక్రమ్ సృష్టి!

కమెడియన్ నుండి హీరోగా టర్నింగ్ ఇచ్చిన సునీల్ కు ఈ మధ్య వరుస సినిమాలు తెగ టెన్షన్ పెడుతున్నాయి. దాదాపు మూడేళ్ళనుండి వరుసగా సినిమాలన్నీ పరాజయాలు అవుతున్నాయి. ప్రస్తుతం అయన నటించిన ”ఉంగరాల రాంబాబు” రేపు విడుదలకు సిద్ధం అయింది. నిజానికి ఈ సినిమా విడుదల విషయంలో కూడా చాలా ఆలస్యం అయింది. దానికి కారణం సునీల్ గత సినిమాల ఎఫెక్ట్ ? సక్సెస్ ఫుల్ నిర్మాత దిల్ రాజు బ్యానర్ లో చేసిన ”కృష్ణాష్టమి” కూడా వర్కవుట్ కాలేదు .. దాంతో సునీల్ మళ్ళీ కమెడియన్ గా రీ ఎంట్రీ ఇవ్వడానికి కు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది ? ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయట!! దానికి కారణం .. క్రేజీ దర్శకుడు త్రివిక్రమ్ నెక్స్ట్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ”జై లవకుశ” లో నటిస్తున్న ఎన్టీఆర్ ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ సినిమా చేయనున్నాడు. నవంబర్ నుండి మొదలయ్యే ఈ సినిమాలో సునీల్ కమెడియన్ గా నటిస్తాడట ? హీరోగా నటించిన తరువాత సునీల్ ఇతర హీరోల సినిమాల్లో కమెడియన్ గా నటించలేదు. హీరోగా ఎలాగూ సరైన సక్సెస్ రావడం లేదు, ప్రేక్షకులకు దూరం అవుతున్నానని తెలుసుకున్న సునీల్ మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అయినట్టు టాక్ ? మరి ఈ విషయం పై క్లారిటీ రావాలంటే .. ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

Comments