ప్రచురణ తేదీ : Jun 14, 2018 12:52 PM IST

వైఎస్ బయోపిక్ లో సీనియర్ నటిమణి!

మలయాళం స్టార్ హీరో మమ్ముంటి ప్రధాన పాత్రలో దివగంత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. యాత్ర అనే ఆ సినిమా షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ చేశారు. కానీ పూర్తిగా పాత్రలకు సంబందించిన క్యారెక్టర్స్ ను ఫైనల్ చేయలేదు. రేసెంట్ గా వైఎస్ పర్సనల్ అసిస్టెంట్ సూరీడు పాత్ర కోసం పోసాని కృష్ణ మురళిని ఫిక్స్ చేశారు. ఇక వైఎస్ సతీమణి విజయమ్మ పాత్ర కోసం బాహుబలి ఫెమ్ ఆశ్రిత ను ఫైనల్ చేశారు.

ఇక వైఎస్ హయాంలో కీలక నేతగా కొనసాగిన సబితా ఇంద్రా రెడ్డి పాత్ర కోసం సీనియర్ హీరోయిన్ సుహాసిని మణితర్నం ను తీసుకున్నారు. సుహాసిని దర్శకుడు మణిరత్నం సతీమణి అని అందరికి తెలిసిన విషయమే. అయితే ఆమె గత కొంత కాలం నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇక యాత్ర సినిమాలో కథ విన్నగానే ఫైనల్ చేశారు. యువ దర్శకుడు మహి వి రాఘవ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

Comments