ప్రచురణ తేదీ : Thu, Dec 7th, 2017

ఫోటో టాక్ : మతి పోగొడుతున్న బాద్షా డాటర్ !

మొన్నటివరకు సోషల మీడియాలో చెలరేగి అందాల ప్రదర్శన చేసిన శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్ లో హీరోయిన్ అయిపోయింది. ఆమె ప్రస్తుతం ఓ చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో స్టార్ వారసుల హంగామా ఎక్కువవుతోంది. కొంతమంది బడా తారల కొడుకులు, కుమార్తెలు బాలీవుడ్ లో గెంతులేయడానికి రెడీ అవుతున్నారు. ఆ ప్రయత్నాల్ని అప్పుడే మొదలుపెట్టిందా అన్నట్లుగా ఉంది ఈ అమ్మడి ఫోజు.

కుర్రాళ్ల మతులు పోగొడుతున్న ఈమె మరెవరో కాదు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ కుమార్తె సుహానా ఖాన్. ఇటీవల సోషల్ మీడియాలో ఈ ఫోటోని ఆమె పోస్ట్ చేసింది. అంతే క్షణాల్లో వైరల్ గా మారిపోయింది. ఈ కుర్ర భామ అందాలు చూస్తుంటే త్వరలోనే బాలీవుడ్ తలుపు తట్టడం ఖాయమని అని నెటిజన్లు అంటున్నారు.

Comments