ప్రచురణ తేదీ : Feb 23, 2017 5:07 PM IST

చిరు – కళ్యాణ్ సినిమాకి కథ సిద్దం అవుతోంది


పవన్ కళ్యాణ్ – చిరంజీవి కలిసి తెరమీద కనపడితేనే రచ్చ రేగుతుంది అలాంటిది మల్టీ స్టారర్ సినిమా చేస్తే ఇంకేమైనా ఉందా? రచ్చ పీక్ లోకి వెళ్ళిపోతుంది. వారిద్దరితో సినిమా చేస్తాను అని ఎంపీ సుబ్బిరామిరెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా అయ్యే ఛాన్స్ కూడా లేదు అని అందరూ ఎగతాళి చేస్తున్న టైం లో సుబ్బిరామి రెడ్డి మళ్ళీ ఈ సినిమా గురించి మాట్లాడారు. చిరు, ప‌వ‌న్‌ల‌తో మల్టీస్టారర్‌ సినిమా తీసేందుకు కథ సిద్ధమవుతోందని ఈ రోజు స్ప‌ష్టం చేశారు. ఈ సినిమాకి అశ్వనీదత్ కూడా నిర్మాతగా ఉంటారని చెప్పారు. ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు అధికంగా ఉంటాయని చెప్పారు. అభిమానుల అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లుగానే క‌థ‌ను రెడీ చేస్తున్నామని అన్నారు. మహాశివరాత్రి సందర్భంగా విశాఖ సాగరతీరంలో లలిత కళాపరిషత్‌ ఆధ్వర్యంలో రేపు కోటి శివలింగ ప్రతిష్ట, మహా కుంభాభిషేకం నిర్వహిస్తామ‌ని, దీనికి సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు హాజ‌ర‌వుతార‌ని ఆయ‌న చెప్పారు. పెందుర్తి శారదాపీఠం స్వామి స్వరూపానంద సరస్వతి కూడా వ‌స్తార‌ని అన్నారు.

Comments