ప్రచురణ తేదీ : Nov 10, 2017 6:57 PM IST

`ప‌ద్మావ‌తి` రిలీజ్ ఆపాలంటూ మోదీకి లేఖాస్త్రం!

భ‌న్సాలీ `ప‌ద్మావ‌తి` ఆరంభం నుంచి వివాదాల్లో న‌లుగుతున్న సంగ‌తి తెలిసిందే. రాజ్‌పుత్ క‌ర్ణిసేన‌లు ప‌లుమార్లు ప‌ద్మావ‌తి సెట్స్‌పై దాడి చేసి విధ్వంశం సృష్టించారు. యూనిట్ స‌భ్యుల‌పైనా చెయ్యి చేసుకున్నారు. రాణీ ప‌ద్మావ‌తి చ‌రిత్ర‌ను వ‌క్రీక‌రిస్తున్నార‌ని, ముస్లిమ్ అయిన ఖిల్జీని హైలైట్ చేస్తూ వెండితెర‌పై చూపిస్తున్నార‌న్న‌ది క‌ర్ణి సేన‌ల ప్ర‌ధాన ఆరోప‌ణ‌. రీసెంటుగానే హైద‌రాబాద్ గోషామ‌హ‌ల్‌ భాజ‌పా నాయ‌కుడు రాజాసింగ్ .. తెలంగాణ‌లో ప‌ద్మావ‌తి రిలీజ్‌ని అడ్డుకుంటామ‌ని ప్ర‌క‌టించడం సంచ‌ల‌న‌మైంది. ఆ క్ర‌మంలోనే ఆగ్రాలోనూ ఈ సినిమా రిలీజ్‌ని అడ్డుకునేందుకు హెచ్చ‌రిక‌లు జారీ చేసింది విశ్వ‌హిందూ ప‌రిష‌త్‌. స్థానిక హిందూ నాయ‌కులు ప‌ద్మావ‌తి రిలీజ్‌ని ఎట్టిప‌రిస్థితిలో అడ్డుకునేందుకు శ‌త‌ధా ప్ర‌య‌త్నిస్తున్నారు.

ఈ వివాదాల క్ర‌మంలోనే మ‌రో వివాదం.. భార‌త‌దేశ స‌మ‌గ్ర‌త‌, జాతి స‌త్సాంప్ర‌దాయాల్ని కాపాడాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వాల‌కు ఉంది. చ‌రిత్ర‌ను వ‌క్రీక‌రించి సినిమాలో చూపిస్తున్నారు కాబ‌ట్టి ఆ సినిమా రిలీజ్‌ని అడ్డుకోవాల్సిందిగా ఏకంగా ప్ర‌ధాని మోదీకి లేఖ రాశారు మేవార్(రాజ‌స్థాన్ న‌గ‌రం) రాయ‌ల్, లోక్‌స‌భ స‌భ్యుడు మ‌హారాజ్‌కుమార్ విశ్వ‌రాజ్ సింగ్‌. మేవార్ సామ్రాజ్య‌పు 76వ మ‌హారానా మ‌హేంద్ర సింగ్ మేవార్ త‌న‌యుడు అయిన విశ్వ‌రాజ్ సింగ్ .. ఈ లేఖ‌ను ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ స‌హా, కేంద్ర స‌మాచార శాఖ మంత్రి స్మృతి ఇరానీ, కేంద్ర సెన్సార్‌బోర్డ్ అధ్య‌క్షులు ప్ర‌సూన్ జోషి స‌హా కేంద్ర మాన‌వ‌వ‌న‌రుల అభివృద్ధి శాఖ మంత్రి ప్ర‌కాష్ జ‌వదేక‌ర్‌, రాజ‌స్థాన్ ముఖ్య‌మంత్రి వ‌సుంధ‌ర రాజే త‌దిత‌రుల‌కు లేఖాస్త్రం సంధించారు. డిసెంబ‌ర్ లో రిలీజ‌వుతున్న `ప‌ద్మావ‌తి`ని రిలీజ్ కానీకుండా చేయాల‌ని ఆ లేఖ‌లో అభ్య‌ర్థించారాయ‌న‌. క‌నీసం రాజ‌కుటుంబీకుల్ని సంప్ర‌దించి ఈ సినిమా తెర‌కెక్కించి ఉండాల్సింద‌ని ఆ లేఖ‌లో ఆయ‌న అభిప్రాయం వ్య‌క్తం చేశారు. అయితే ప‌ద్మావ‌తి రిలీజ్‌ని ఆపేందుకు భాజ‌పా కుట్ర చేసిందంటూ విప‌క్షాలు విమ‌ర్శిస్తుండ‌డం మ‌రో సెన్సేష‌న్‌. సూఫీ క‌వి మాలిక్ మొహ‌మ్మ‌ద్ జ‌య‌సి `పోయెటిక్ ఇమేజ‌రి` ఆధారంగా త‌ప్పుడు స‌న్నివేశాల‌తో ప‌ద్మావ‌తి చిత్రాన్ని భ‌న్సాలీ తెర‌కెక్కించార‌ని ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఆ క్ర‌మంలో ఈ సినిమా రిలీజ్‌పై నీలినీడ‌లు క‌మ్ముకున్నాయి.

Comments