ప్రచురణ తేదీ : Jun 12, 2018 9:19 AM IST

నాని – శ్రీ రెడ్డి వివాదంపై స్పందించిన స్టార్ మా!

బిగ్ బాస్ మొదలైంది ఇక హౌస్ లో వివాదాలు మొదలైనట్లే అని అంతా అనుకున్నారు. కానీ లోపల కంటే బయటే ఎక్కువగా వివాదాలు నడుస్తున్నాయి. హోస్ట్ గా మొదటి సారి బాధ్యతలు తీసుకున్న నాని మొదటి రోజు అదరగొట్టేశాడు. అయితే ఎవరు ఊహించని విధంగా శ్రీ రెడ్డి నానిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఒక్కసారిగా అందరిని షాక్ కి గురి చేసింది. ఆ వ్యాఖ్యలకు నాని కూడా స్పందించి చట్టపరంగా నోటీసులు ఇచ్చి న్యాయ పోరాటానికి సిద్దమయ్యాడు.

బిగ్ బాస్ షోలో తనకు అవకాశం రాకుండా నాని చేశాడనే కోపంతో శ్రీ రెడ్డి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై స్టార్ మా స్పందించింది. పరిశీలించిన 125 మంది పేర్లలో శ్రీ రెడ్డి పేరు ఉన్న మాట వాస్తవమే. కానీ ఎవరిని ఉంచాలి ఎవరిని ఉంచవద్దు అనే విషయంలో నాని ఎప్పుడు కలుగజేసుకోలేదు. పూర్తిగా ఆ విషయంలో షో నిర్వాహకులదే ఫైనల్ నిర్ణయమని స్టార్ యాజమాన్యం అధికారికంగా తెలిపింది.

Comments