ప్రచురణ తేదీ : Apr 11, 2018 6:02 PM IST

శ్రీరెడ్డి బ్లాస్టింగ్ లీక్స్‌.. ప్రముఖ రైటర్, డైరెక్టర్ల చీక‌టి భాగోతం లీక్‌..!

ఎన్నో రోజులుగా శ్రీ రెడ్డి ఫోన్లో దాగున్న టాలీవుడ్ సెలబ్రిటీల రహస్యాలు ఉవ్వెత్తున కురిసే వర్షంలా గంట‌కో బ్లాస్టింగ్ సెన్షేష‌న్స్ సంచ‌ల‌నం లీక్ అవుతూనే ఉన్నాయి. త‌న ద‌గ్గ‌ర టాలీవుడ్ బాడా బాబుల చీక‌టి భాగోతాలకి సంబంధించి అధారాలు త‌న ద‌గ్గ‌ర ఉన్నాయని మీడియాకి ఎక్కిన శ్రీరెడ్డి.. ఫిల్మ్ ఛాంబ‌ర్ ముందు అర్ధ‌న‌గ్న నిర‌స‌న కూడా చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే శ్రీరెడ్డి బ‌ట్ట‌లు లేకుండా నిర‌స‌న తెలియ‌జేయ‌డంతో ‘మా’ మహా మూర్తులు మీడియా సాక్షిగా శ్రీరెడ్డిన బ‌హిష్క‌రించిన సంగ‌తి తెలిసిందే.

దీంతో మ‌రోసారి మీడియా కెక్కిన శ్రీ రెడ్డి టాలీవుడ్ ప్ర‌ముఖులు సంచ‌ల‌న ఫొటోలు డైరెక్ట్‌గా లీక్ చేసి టాలీవుడ్ బ‌డా బాబుల నెత్తిన పెద్ద బాంబే పేల్చింది. ఇక శ్రీరెడ్డి లీక్ చేసిన ఫొటోల్లో ప్ర‌ముఖ నిర్మాత‌ ద‌గ్గుబాటి సురేష్ రెండ‌వ త‌న‌యుడు అభిరాంతో శ్రీరెడ్డితో స‌న్నిహితంగా ఉన్న ఫొటోలు సోష‌ల్ మీడియాలో విడుద‌ల చేయ‌డంత‌తో వైర‌ల్ అవుతున్నాయి. అదే క్ర‌మంలో మ‌రో ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజును టార్గెట్ చేస్తూ రాజుగారు మీరు ఇండ‌స్ట్రీని వ‌దిలిపోతే టాలీవుడ్‌కి ప‌ట్టిన శ‌ని వ‌దిలిపోతుంది త‌న ఫేస్ బుక్‌లో పోస్టు పెట్టింది శ్రీరెడ్డి.

దీంతో ఇప్ప‌టికే టాలీవుడ్‌లో ప్ర‌కంప‌న‌లు సృష్టించ‌గా.. మ‌రో బాంబు పేల్చింది శ్రీరెడ్డి. ఈసారి ఏకంగంగా టాలీవుడ్ ప్ర‌ముఖ ర‌చ‌యిత, నిర్మాత మరియు తాజాగా చిత్ర పరిశ్రమకు వరుస‌గా హిట్లు ఇచ్చిన‌ ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ ఇద్ద‌రితో చేసిన వాట్సప్ రొమాంటిక్ ఛాటింగ్‌ను బ‌య‌ట‌పెట్టింది శ్రీరెడ్డి.మ‌రి అవి మార్ఫింగ్ చేసిన‌వో, రియ‌ల్ చాటింగో తెలియ‌దు కానీ సినీ వ‌ర్గాల్లో మాత్రం పెద్ద ర‌చ్చే జ‌రుగుతోంది. ఏది ఏమైనా నాటి సుచిత్రా లీక్స్ కంటే నేటి శ్రీరెడ్డి లీక్స్ సినీ వ‌ర్గాల్లో పెద్ద దుమార‌మే రేపుతోంది. మ‌రి ఈ శ్రీరెడ్డి లీక్స్‌కి పుల్‌స్టాప్ ఎప్పుడు ప‌డుతుందో చూడాలి.

Comments