ప్రచురణ తేదీ : Mar 15, 2018 6:15 PM IST

సొంత బ్యానర్ మొదలు పెడుతున్న శ్రీను వైట్ల ?

వరుసగా మూడు భారీ పరాజయాలతో కెరీర్ బాగా వీక్ అయిపోయిన క్రేజీ దర్శకుడు శ్రీను వైట్ల కు హీరోలు అవకాశాలు ఇచ్చే ఛాన్సులు బాగా తగ్గిపోయాయి. చాలా గ్యాప్ తరువాత ఆయనకు రవితేజ అవకాశం ఇవ్వడంతో అమర్ అక్బర్ ఆంటోని చిత్రాన్ని ఇటీవలే మొదలు పెట్టాడు. మైత్రి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ప్రస్తుతం శ్రీను వైట్ల సొంత బ్యానర్ మొదలు పెట్టాలనే ఆలోచనలో ఉన్నాడట. ఎందుకంటే ప్రస్తుతం రవితేజ సినిమా తరువాత నెక్స్ట్ ఏమిటి ? అనే సందిగ్ధంలో ఉన్నాడు అయన. దాంతో సొంత బ్యానర్ అయితే ముందే సెట్ చేసుకోవచ్చు. పైగా నచ్చిన కథను నచ్చిన హీరోతో తీయొచ్చు అన్న ఆలోచనలో భాగంగా అయన సొంత నిర్మాణ సంస్థ ను మొదలు పెడతాడని అంటున్నారు.

Comments