ప్రచురణ తేదీ : Nov 13, 2017 11:37 AM IST

షాక్ .. ఏంటి శ్రీను వైట్ల ట్రాక్ మార్చాడు ?

టాలీవుడ్ లో క్రేజీ దర్శకుడిగా ఇమేజ్ తెచ్చుకున్న శ్రీను వైట్ల సినిమాలంటే పూర్తీ స్థాయి ఎంటర్ టైన్మెంట్ తో ఉంటాయని అందరికి తెలుసు. అలా సక్సెస్ ఫుల్ దర్శకుడిగా క్రేజ్ తెచ్చుకున్న శ్రీను వైట్ల కు ఈ మధ్య వరుస పరాజయాలు టెన్షన్ పెట్టాయి. ఇప్పటికే మహేష్ ఆగడు, రామ్ చరణ్ బ్రుస్ లీ, వరుణ్ తేజ్ మిస్టర్ సినిమాలు భారీ పరాజయాన్ని అందుకోవడంతో అయన క్రేజ్ తిరగబడింది ? దాంతో శ్రీను వైట్లను కొత్త అవకాశాలు రావడం లేదు .. తాజాగా రవితేజ ఆయనతో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు .. కానీ నిర్మాతలు ఇంకా టైం ఉందని చెప్పడంతో శ్రీను వైట్ల టెన్షన్ లో పడ్డాడు .. అందుకే అయన ట్రాక్ మర్చి .. వెబ్ సిరీస్ తీసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది ? ఓ ప్రముఖ నిర్మాణ సంస్థతో కలిసి ఈ వెబ్ సిరీస్ లను ప్లాన్ చేస్తున్నాడట. దర్శకుడిగా సినిమాలకోసం ప్రయత్నాలు చేసుకోక .. శ్రీను వైట్ల ఇలా ట్రాక్ ఎందుకు మార్చడబ్బా అని అందరు షాక్ అవుతున్నారు.

Comments