ప్రచురణ తేదీ : Dec 7, 2017 10:11 PM IST

స్కూల్లో శ్రీ‌దేవి డ్యాన్సులు, యాక్టింగ్ పాఠాలు..

అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి డ్యాన్సులు, యాక్టింగుపై బ‌డిలో పాఠాలు చెప్ప‌నున్నారా? అంటే అవున‌నే తెలుస్తోంది. అయితే అది ఏ బ‌డి? ఎక్క‌డుంది? అని ప్ర‌శ్నిస్తే ఇదిగో స‌మాధానం.

నాలుగు ద‌శాబ్ధాల సుదీర్ఘ న‌ట‌నానుభ‌వం ఉన్న క‌థానాయిక శ్రీ‌దేవి. తెలుగు, త‌మిళ్‌, హిందీ ప‌రిశ్ర‌మ‌ల్లో మేటి నాయిక‌గా చ‌క్రం తిప్పి చివ‌రికి బోనీక‌పూర్‌ని పెళ్లాడి లైఫ్‌లో స్థిర‌ప‌డింది. శ్రీ‌దేవి అభిన‌య‌నేత్రి. గొప్ప న‌ర్త‌కి. న‌ట‌న‌, అభిన‌యం, ఆహార్యంలో త‌నో గ్రంధం అంటే అతిశ‌యోక్తి కాదు. అందుకే శ్రీ‌దేవికి ప్ర‌పంచ‌వ్యాప్తంగా వీరాభిమానులున్నారు. అలాంటి అభిమానుల్లో మేటి అభిమాని అయిన చెన్న‌య్ వాసి అనీష్ నాయ‌ర్ ఏకంగా శ్రీ‌దేవి పేరుతోనే ఓ న‌ట‌శిక్ష‌ణ సంస్థ‌ను ప్రారంభించేస్తున్నాడు. ఆ విష‌యాన్ని మీడియా ముఖంగా అత‌డు వెల్ల‌డించాడు. ఆ సంగ‌తి తెలిసిన శ్రీ‌దేవి ఎంతో సంతోషించారుట‌. త‌న పేరుతో ఓ న‌ట‌శిక్ష‌ణ స్కూల్ ప్రారంభిస్తున్న నాయ‌ర్‌ అభిమానానికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ స్కూల్లో.. శ్రీదేవి నటించిన సినిమాలు, ఆమె నటన, నాట్యం, ఆహార్యానికి సంబంధించిన క్లాసులు చెబుతారుట‌. నటనపై ఆసక్తి ఉండి పేద‌రికం అడ్డంకిగా మారిన వారికి ఉచితంగా ఇక్క‌డ శిక్ష‌ణ ఇచ్చే ఏర్పాటు ఉంటుంది. కొత్త సంవ‌త్స‌రంలో ప్రారంభోత్స‌వం చేయ‌నున్న ఈ స్కూల్ రిబ్బ‌ను క‌టింగుకి శ్రీ‌దేవి విచ్చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. అలాగే ఈ స్కూల్‌లో శ్రీ‌దేవి స్వ‌యంగా క్లాసులు చెబుతార‌ని చెబుతున్నారు. చెన్న‌య్‌తో పాటు బెంగ‌ళూరు, దిల్లీ, కోల్‌క‌త‌, ముంబైలోనూ శ్రీ‌దేవి ఇనిస్టిట్యూట్ బ్రాంచీలు తెరుస్తారుట ఇత‌గాడు. 54 వ‌య‌సులోనూ రాణిస్తున్న శ్రీ‌దేవి క్రేజును నాయ‌ర్ బాగానే ఉప‌యోగించుకుంటున్నాడే.

Comments