ప్రచురణ తేదీ : Dec 6, 2017 9:26 PM IST

పిక్ టాక్ : గుచ్చి గుచ్చి చంప‌మాకు చంద‌మామ‌!?


గుచ్చి గుచ్చి చూడ‌క‌లా.. గుండెల్లో గున‌పం దించ‌క‌లా.. అందాల చంద‌మామ‌.. .? అంటూ కుర్ర‌కారులో క‌విత్వం అలా అలా త‌న్నుకు రావాల్సిందే. అంత అందంగా క‌వ‌ర్‌పేజీపై ఒదిగిపోయిన ఈ అమ్మ‌డు ఎవ‌రో ఇట్టే చెప్పేస్తారు యూత్‌. సాహో నాయిక‌.. ఆషికి -2 ఫేం శ్ర‌ద్ధాక‌పూర్ కి తెలుగులోనూ ఫాలోయింగ్ ప్రారంభ‌మైంది. అందానికి అందం, అంత‌కుమించి ప్ర‌తిభ ఉన్న శ్ర‌ద్ధా టాలీవుడ్‌లోనూ దూసుకుపోయే ఛాన్సుంది. లేటెస్టుగా ప్ర‌ఖ్యాత ఫెమినా మ్యాగ‌జైన్ క‌వ‌ర్‌పేజీ కోసం ఫోజులిచ్చిందిలా. మిరుమిట్లు గొలుపుతున్న ఆ డ్రెస్ న‌మ్ర‌త జోషిపురా ఔట్ ఫిట్‌. యువ‌త‌రం చూడ‌గానే హ‌త్తుకుపోయే అంద‌చందాలు ఈ ల‌ల‌న‌లో క‌నిపిస్తున్నాయి క‌దూ?

`సాహో` చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న అలాంటి క‌వ్వించే పాత్ర‌లోనే క‌నిపించ‌బోతోంది. ప‌ల్లెటూరి అమ్మాయి .. అమాయ‌క‌త్వం క‌ల‌బోసిన పాత్ర‌లో క‌నిపిస్తున్నా ప్ర‌బాస్‌నే ల‌వ్‌లో దించే సోగ్గ‌త్తెగా క‌నిపించ‌బోతోంది. రాజ్ కుమార్ రావ్ స‌ర‌స‌న ఓ రొమాంటిక్ కామెడీలో న‌టిస్తోంది. బ్యాడ్మింట‌న్ స్టార్‌ సైనా నెహ్వాల్ జీవిత‌క‌థ‌లోనూ న‌టించ‌నుంది.

🙃🤓 @feminaindia @shraddha.naik @amitthakur_hair @akshitas11

A post shared by Shraddha (@shraddhakapoor) on

Comments