స్పైడర్ చూడాలంటే… 10 వేలు జేబులో ఉండాలి! ఇలా ఎలా?

రెండు వారాల్లో రెండు పెద్ద సినిమాలు తెలుగు ప్రజలకి అదిరిపోయే పండగ, ఓ వైపు ఎన్టీఆర్ మరో వైపు సూపర్ స్టార్. ఒకటి జై లవకుశ, మరొకటి స్పైడర్. దసరా బరిలో వస్తున్న రెండు తెలుగు సినిమాల ఊపు ఇప్పుడు సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి, మరో వైపు నందమూరి ఫ్యాన్స్ కి పండగ తీసుకొచ్చింది. సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయా అనే ఆశగా అందరు ఎదురుచూస్తున్నారు. దీంతో సినిమా ప్రీమియర్ కి అందరు రెడీ చేసుకుంటున్నారు. మరో వైపు అమెరికాలో కూడా స్పైడర్, జై లవకుశ ప్రీమియర్ భారీగా ప్లాన్ చేసారు. అక్కడి తెలుగు ప్రజలని ద్రుష్టిలో పెట్టుకొని డిస్టిబ్యూటర్స్ వీలైనంత వేగంగా సినిమా మీద పెట్టిన పెట్టుబడి వెనక్కి తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. దీనికి గాను టికెట్ ధర ఉన్నపళంగా భారీ ధర పెట్టేసారు.

ఓవర్సీస్ లో జై లవకుశ 8.5 కోట్లుకి కొంటె, అదే స్పైడర్ సినిమా రైట్స్ మాత్రం దీనికి డబల్ డిజిట్ 15.2 కోట్లుకి కొనుగోలు చేసినట్లు సమాచారం. వాళ్ళకి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఇంత పెద్ద మొత్తంలో రైట్స్ తీసుకున్నట్లు తెలుస్తుంది. దానికి తోడు ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాకి ఓవర్సీస్ లో డిమాండ్ భాగా పెరిగింది. ఈ రెండు వారాల్లో రిలీజ్ కాబోతున్న సినిమాలకి ప్రీమియర్ ముందుగానే అమెరికాలో ప్లాన్ చేసారు. దీనిలో భాగంగా 26న స్పైడర్ ప్రీమియర్ షో ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ షో ప్రదర్శితం అవుతున్న బిగ్ స్క్రీన్ థియేటర్ లో టికెట్ ధర ఏకంగా 31 డాలర్లకి పైగా నిర్ణయించారు. అంటే ఇండియన్ కరెన్సీ లో చూసుకుంటే ఒక టికెట్ ధర 2040 పడుతుంది. ఈ లెక్కన ఒక ఫ్యామిలీ సినిమాకి వెళ్ళాలంటే ఖర్చులతో కలుపుకొని 10వేల రూపాయిల వరకు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక జై లవకుశ కూడా ఈ రేంజ్ లో కాకున్న చుక్కలు కనిపించేలానే ఉన్నాయి. 13 వందల రూపాయిల పైన ఒక టికెట్ ధర ఉంది. అంటే ఈ సినిమాకైనా ఫ్యామిలీతో కలిసి వెళ్ళాలంటే 6 వేల దగ్గర ఖర్చు అవుతుంది.

మొత్తానికి అమెరికాలో ఉన్న తెలుగు ప్రజలు వీకెండ్ లో రిలీజ్ కి రెడీ అయిన స్టార్ హీరోల సినిమాలు చూడాలంటే మాత్రం తడిసి మోపెడు అవుతుంది. డిస్టిబ్యూటర్స్ కూడా ఎ మాత్రం ఆలోచించకుండా వీలైనంత వరకు ఫస్ట్ వీక్ లోనే పెట్టిన పెట్టుబడి మొత్తం వెనక్కి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే తెలుగు సినిమా ఫ్యాన్స్ కూడా ఎ మాత్రం ఆలోచించకుండా సినిమా చూసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.

Comments