ప్రచురణ తేదీ : Nov 14, 2017 7:09 PM IST

హాట్ టాపిక్‌ : 60 ప్ల‌స్‌లో మెగాస్టార్ క‌ఠోర త‌ప‌స్సు!

మెగాస్టార్ చిరంజీవి ఇటీవ‌లే ష‌ష్ఠిపూర్తి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. 60వ‌య‌సు వెళ్లినా ఇంకా త‌న‌లో 30ప్ల‌స్‌ స్పీడ్ త‌గ్గ‌లేద‌ని `ఖైదీనంబర్ 150`తో ప్రూవ్ చేశారు. డ్యాన్సులు, ఫైట్స్ ప్ర‌తిదాంట్లో త‌న‌దైన నైపుణ్యం .. శ్ర‌మ చూపించారు మెగాస్టార్‌. ఈ ఏజ్‌లోనూ ఆయ‌న‌ ఏ విష‌యంలోనూ త‌గ్గ‌డం లేద‌న్న‌ది స‌న్నిహితులు చెబుతున్న మాట‌. అయితే అదెలా సాధ్యం? అంటే.. నిరంత‌ర వ్యాయామం, ఆహార‌నియ‌మాల‌తో పాటు అవ‌స‌రం అయిన ప్ర‌త్యేక శిక్ష‌ణ‌ల‌కు ఆయ‌న ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఈ వ‌య‌సులోనూ క‌ఠోర త‌పస్సు చేసేందుకు ఆయ‌న వెన‌కాడ‌రు. అందుకే నిత్య‌య‌వ్వ‌నుడిగా మైమ‌రిపించ‌గ‌లుగుతున్నార‌న్న‌ది చూసిన‌వారు చెప్పే మాట‌.

ఇక 60 ప్ల‌స్‌లోనూ ఆయన క‌త్తి యుద్ధాలు నేర్చుకుంటూ షాకిస్తున్నారు. ప్ర‌స్తుతం సెట్స్‌కెళ్లేందుకు రెడీ అవుతున్న `సైరా- న‌ర‌సింహారెడ్డి` కోసం మెగాస్టార్ క‌త్తి యుద్ధాలు స‌హా భారీ యాక్ష‌న్ చేయాల్సి ఉంటుంది. అందుకోసం ప్ర‌త్యేకించి ఇద్ద‌రు శిక్ష‌కుల్ని నియ‌మించారుట‌. డిసెంబ‌ర్ 6 నుంచి హైద‌రాబాద్ అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో చిత్రీక‌ర‌ణ ప్రారంభించ‌నున్నారు. ఇక‌మీద‌ట ఆన్‌సెట్స్ కూడా శిక్ష‌కులు మెగాస్టార్ వెంటే ఉంటారుట‌. షూటింగ్‌లో అవ‌స‌రం మేర శిక్ష‌ణ‌నిస్తార‌ని చెబుతున్నారు. ఆ మేర‌కు ఇప్ప‌టికే నిర్మాత రామ్ చ‌ర‌ణ్ శిక్ష‌కుల్ని నియ‌మించ‌డ‌మే గాకుండా అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. న‌య‌న‌తార‌, సుదీప్‌, అమితాబ్ బ‌చ్చ‌న్‌, విజ‌య్ సేతుప‌తి వంటి స్టార్స్‌తో బహుభాషా చిత్రంగా తెర‌కెక్క‌నున్న `సైరా న‌రసింహారెడ్డి`కి ఏ.ఆర్.రెహ‌మాన్ సంగీతం అందిస్తున్నారు. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న ఈ చిత్రం కోసం ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్‌, బుర్రా సాయిమాధ‌వ్ వంటి టాప్ రైట‌ర్స్ పని చేస్తున్నారు.

Comments