ప్రచురణ తేదీ : Sun, Oct 8th, 2017

సింగిల్ విండో అనుమ‌తులు ..ఎట్ట‌కేల‌కు అమ‌ల్లో..!!

అవిభాజ్య ఆంధ్ర ప్ర‌దేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం విడిపోయాక సినీప‌రిశ్ర‌మ గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. పరిశ్ర‌మ‌లో తేవాల్సిన మార్పుల గురించి తెలంగాణ ప్ర‌భుత్వం చాలా సీరియ‌స్‌గానే ఆలోచించింది. ముఖ్యంగా షూటింగుల కోసం లొకేష‌న్ల ప‌ర్మిష‌న్లు తెచ్చుకోవాలంటే మ‌న మేక‌ర్స్‌కి నానా ఇబ్బందులుండేవి. వాట‌న్నిటినీ ప‌రిష్క‌రించేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం సానుకూలంగానే మాటిచ్చింది. సింగిల్ విండో ప్రాతిపాదిక‌న అనుమ‌తులు పొందేందుకు ఏర్పాట్లు చేస్తామ‌ని తెలిపింది. అయితే కేసీఆర్ పాల‌న ప్రారంభ‌మై మూడేళ్ల‌యినా .. అది మాట‌ల వ‌ర‌కే ప‌రిమిత‌మైంద‌న్న వాద‌న వినిపించింది ఇటీవ‌లి కాలంలో.

ఎట్ట‌కేల‌కు ఆ ప్రామిస్‌ని నిల‌బెట్టుకుంది టి-ప్ర‌భుత్వం. నేటి నుంచి సింగిల్ విండో ప‌ద్ధ‌తిలో షూటింగుల అనుమ‌తి పొందే ఏర్పాటు అమ‌ల్లోకి వ‌చ్చింది. నేడు సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస యాద‌వ్ స్వ‌యంగా సింగిల్ విండో షూటింగ్ ప‌ర్మిష‌న్స్ వింగ్‌ను ప్రారంభించారు. హైద‌రాబాద్‌ సెక్ర‌టేరియ‌ట్ లో ఈ శ‌నివారం ఉద‌యం 11 గంట‌ల‌కు డి-బ్లాక్ లోని గ్రౌండ్ ఫ్లోర్‌లో కాన్ఫ‌రెన్స్ హాల్‌లో లాంచింగ్ కార్య‌క్ర‌మం చేశారు. ఇక నుంచి సునాయాసంగా ఎలాంటి స‌మ‌స్య‌లు లేకుండా సింగిల్ విండో విధానంలో నిర్మాత‌లు షూటింగు అనుమ‌తులు పొంద‌వ‌చ్చ‌ని త‌ల‌సాని ఈ సంద‌ర్భంగా వెల్ల‌డించారు. అంతేకాదు.. తెలంగాణ ప్రభుత్వం త‌ర‌పున అధికారికంగా ఆన్‌లైన్ టికెటింగ్ కోసం ప్ర‌భుత్వ పోర్ట‌ల్‌ని త‌ల‌సాని ప్రారంభించారు.

Comments