ప్రచురణ తేదీ : Jan 25, 2017 8:12 PM IST

య‌ముడు -3 రిలీజ్ వాయిదా, కొత్త తేదీ ఫిబ్ర‌వ‌రి- 9

singam-3
సూర్య క‌థానాయ‌కుడిగా న‌టించిన ఎస్‌-3 (య‌ముడు-3) అనివార్య కార‌ణాల‌తో వాయిదా ప‌డుతూ వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. తొలుత ఈ సినిమా రిలీజ్ జ‌న‌వ‌రి 26న ఉంటుంద‌ని ప్ర‌క‌టించారు. జ‌ల్లిక‌ట్టు ఉద్య‌మానికి బాస‌ట‌గా వాయిదా వేశారు. ఆ త‌ర్వాత‌ ఫిబ్ర‌వ‌రి 3న ఉంటుంద‌ని వార్త‌లు వ‌చ్చినా, మ‌రో కొత్త తేదీని స్టూడియోగ్రీన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ష్ సంస్థ ప్ర‌క‌టించింది. ఫిబ్ర‌వ‌రి 9న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నామ‌ని తెలిపారు. అందుకు సంబంధించిన కొత్త పోస్ట‌ర్‌ని లాంచ్ చేశారు.

త‌మిళ‌నాట జ‌ల్లిక‌ట్టు వివాదం .. అలాగే త‌మిళ్‌, తెలుగు సైమ‌ల్టేనియ‌స్ రిలీజ్ త‌దిత‌ర కార‌ణాల‌తో ఇలా వాయిదా వేయాల్సొచ్చింద‌ని నిర్మాత‌లు ఇదివ‌ర‌కే ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. తెలుగు, త‌మిళ్‌లో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సూర్య ఈసారి 100 ప్ల‌స్ క్రోర్ వ‌సూళ్ల క్ల‌బ్‌లో నిలుస్తాడ‌నే అంచ‌నాలున్నాయి.

Comments