ప్రచురణ తేదీ : Sep 20, 2018 11:09 AM IST

బాయ్ ఫ్రెండ్ తో శృతి హాసన్ షికార్లు ?

అందాల భామ శృతి హాసన్ ఈ మధ్య సినిమాలపై పెద్దగా ఫోకస్ పెట్టడం లేదు. ఆమె నటించిన చివరి చిత్రం కాటమరాయుడు. దాంతో పాటు కమల్ హాసన్ తో కలిసి శబాష్ నాయుడు సినిమాలో నటించిన ఈ అమ్మడికి బాలీవుడ్ లో హీరోయిన్ గా సెటిల్ అవ్వాలని తెగ ప్రయత్నాలు చేసింది. కానీ అక్కడ వర్కవుట్ కాకపోవడంతో చాలా ఫీల్ అయినట్టుంది. అందుకే సౌత్ లో ఏ సినిమా చేయడానికి ఆసక్తి చూపలేదు. ఇక ప్రస్తుతం మ్యూజిక్ వైపు ఫోకస్ పెట్టిన శృతి లండన్ లో ఓ కాన్సెర్ట్ చేసింది. ఆ షో సక్సెస్ అవ్వడంతో ఈ అమ్మడి ఆనందానికి అడ్డు లేకుండా పోయింది. ఈ ఉత్సాహంతో మరిన్ని షోలు చేయడానికి ప్లాన్ చేస్తుంది. అయితే ఈ కాన్సెర్ట్ లో ఆమె బాయ్ ఫ్రెండ్ మైకేల్ కోర్సెల్ కూడా వెంటే ఉన్నాడట. ఇద్దరు కలిసి చెట్టపట్టాలు వేసుకుని తెగ తిరుగుతున్నారట. వీరికి పెళ్లి మాత్రమే కాలేదు .. కానీ డేటింగ్ పేరుతొ తెగ తిరిగేస్తున్నారని కోలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి శృతి హాసన్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మ్యూజిక్ పైనే ఉంది .. అంటే ఆమె ఇంకా హీరోయిన్ గా నటించే ఛాన్స్ లేనట్టే. మరి పెళ్లి గురించి మాత్రం ఇంకా క్లారిటీ రావడం లేదు.

Comments