ప్రచురణ తేదీ : Oct 13, 2017 7:00 PM IST

కమల్ హాసన్ రాజకీయాలపై శృతి హాసన్ కామెంట్స్

దేశంలో ఎన్ని ఆసక్తికరమైన ఎన్నికలు వచ్చినా తమిళ నాడు ఎలక్షన్స్ ముందు అవి చాలా చిన్నవని చెప్పాలి. ఎక్కడ లేని రాజకీయా మార్పులు అక్కడ బాగానే చోటుచేసుకుంటాయి. జయలలిత మరణించిన తర్వాత అక్కడ ఏ మార్పులు చోటుచేసుకున్నాయో తెలిసిన విషయమే. అసలే వేడిగా ఉన్న ఆ రాజకీయాల్లోకి సినిమా తారలు కూడా ఈ సారి మా ప్రతాపనాన్ని చూపుతాం అనడంతో దేశంమంతా తమిళ రాజకీయాలవైపు చూస్తోంది.

కమల్ హాసన్ – రజినీ కాంత్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నామని చెప్పడంతో ఈ సారి వచ్చే ఎలక్షన్స్ మరింత రసవత్తరంగా జరగనున్నాయి. అయితే రజినీకాంత్ ఇంకా అధికారికంగా తన నిర్ణయాన్ని ఆచరణలో పెట్టలేదు గాని లోకనాయకుడు కమల్ మాత్రం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల 7న తన పుట్టిన రోజు సందర్బంగా పార్టీ పేరును ప్రకటిస్తానని చెప్పారు. దీంతో కమల్ కి మద్దతుగా చాలా మంది సపోర్ట్ గా నిలుస్తున్నారు.

అయితే రీసెంట్ గా తండ్రి రాజకీయాలపై కూతురు శృతి హాసన్ స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. మా నాన్న చాలా నిజాయితీపరుడు. మొహమాటం లేకుండా మొహంపైనే సమాధానాన్ని ఇస్తారు. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఆయనకు ఎప్పటినుంచో ఉందని తన మద్దతు తప్పకుండా తన తండ్రికి ఉంటుందని చెప్పింది. అదే విధంగా అయన తప్పకుండా రాజకీయాల్లో అనుకున్నది సాధిస్తారని చెప్పారు. అయితే తండ్రి పార్టీ పెడితే కూతురు కూడా ప్రచార బాధ్యతలను తీసుకుంటుందా ? అనే కోణంలో అక్కడ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

Comments