ప్రచురణ తేదీ : Fri, Apr 21st, 2017

రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ బాలీవుడ్ ప్రేమజంట ?


ఈ మధ్య బాలీవుడ్ లో ప్రేమాయణాలు ఎక్కువ అయ్యాయి. ఇప్పటికే పలువురు భామలు జోరు ప్రేమాయణాలు సాగిస్తూ .. తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అనుష్క శర్మ- విరాట్ కోహ్లీ, దీపికా – రణవీర్, కత్రినా – రన్బీర్ కపూర్ లాంటి జంటల ప్రేమాయణాలు గత కొంత కాలంగా సాగుతూనే ఉన్నాయి. ఇక లేటెస్ట్ గా ఆషీకీ 2 సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన చిన్నది శ్రద్ధ కపూర్ కూడా ఘాటు ప్రేమాయణం సాగిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ హీరో ఫర్హాన్ అక్తర్ తో ఈ అమ్మడు ప్రేమలో ఉందని టాక్. ఈ విషయం పై శ్రద్ధ ను అడిగితె ఆబ్బె .. మా మధ్య ఏమి లేదు .. తాను నాకు బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే అని చెప్పిన ఈ అమ్మడు ఇప్పుడు అడ్డంగా దొరికిపోయింది? వీరిద్దరూ కలిసి ఫర్హాన్ ఇంట్లో జోరుగా ఎంజాయ్ చేసారని .. అక్కడినుండి రాత్రిళ్ళు వస్తుంటే మీడియా కంట పడిందట ? ఇంకేముంది ఇన్నాళ్లు రహస్యంగా జరిపిన వ్యవహారం ఇప్పుడు బట్ట బయలు అయింది. ఫర్హాన్ – శ్రద్ధ ల మధ్య ప్రేమాయణం ఉందన్న విషయం అర్థం అయిపొయింది. వీరిద్దరూ ఇలా పెళ్ళికిముందు ఒకే ఇంట్లో ఉంటున్నారంటే డేటింగ్ చేస్తున్నారని బి టౌన్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి? మరి ఈ విషయం పై ఈ అమ్మడు ఎలా స్పందిస్తుందో చూడాలి !!

Comments