ప్రచురణ తేదీ : Mon, Jan 9th, 2017

కొత్త గ‌వ‌ర్న‌ర్ మాకొద్దు బాబోయ్‌!

governner
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల‌కు ఉమ్మ‌డి గ‌వ‌ర్న‌ర్‌గా న‌ర‌సింహ‌న్ బాధ్య‌త‌లు నెర‌వేరుస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇరు రాష్ట్రాల‌కు స‌ప‌రేట్ గ‌వ‌ర్న‌ర్లు అవ‌స‌ర‌మ‌ని కేంద్రం భావిస్తోంది. ఆ ప‌నిలో భాగంగానే ఏపీకి కొత్త గ‌వ‌ర్న‌ర్ నియామ‌కంపై త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డుతోంది. ఇటీవ‌లి కాలంలో ఏపీకి కొత్త గ‌వ‌ర్న‌ర్ అంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. కర్ణాటకకు చెందిన శంకరమూర్తి నరసింహన్ స్థానంలోకి వస్తార‌ని ప్రచారం సాగుతోంది. అయితే ఆయ‌న రాక త‌మ‌కి ఇబ్బంది అని భావించిన ఏపీ ఈ విష‌యంపై కేంద్రానికి త‌మ తుది ఆమోదాన్ని తెల‌ప‌కుండా వ్య‌తిరేకించింద‌ని తెలుస్తోంది. ఈ విష‌యంలో అభ్యంత‌రాలున్న‌ట్టు ఏపీ కోరింది. విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం ఇరు రాష్ట్రాల‌కు ఒకే గ‌వ‌ర్న‌ర్ ఉండాల‌న్న నిబంధ‌న ఉంది. దాన‌ని మీరి ఇప్పుడిలా కొత్త గ‌వ‌ర్న‌ర్‌ని ఏర్పాటు చేసే కొత్త స‌మ‌స్య‌లు తెలెత్తుతాయ‌ని ఏపీకి అన్యాయం జ‌రుగుతుంద‌ని, స‌మ‌స్య‌లు అప‌రిష్కృతంగానే ఉండిపోతాయ‌ని ఏపీ ప్ర‌భుత్వం భావిస్తోంది. అందుకే అభ్యంత‌రం చెప్పింద‌ని చెప్పుకుంటున్నారు. కార‌ణం ఏదైనా ప్ర‌స్తుతం కొత్త గ‌వ‌ర్న‌ర్ విష‌యాన్ని కేంద్రం వాయిదా వేసింది. రెండు రాష్ట్రాల‌కు స‌ప‌రేటుగా కొత్త గ‌వ‌ర్న‌ర్ల‌ను నియ‌మించాల‌న్న కేంద్రం నిర్ణ‌యం ఇప్ప‌ట్లో క‌ష్ట‌మే.

Comments