ప్రచురణ తేదీ : Thu, Sep 14th, 2017

డేరాలో విషకన్యలు..షాకింగ్ సీక్రెట్..!

తన ఆశ్రమంలో సాధ్విలుగా చేరిన మహిళలపై అత్యాచారం చేసిన కేసులో గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ (డేరా బాబా ) 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. అతడు జైలుకు వెళ్లిన తరువాత పోలీస్ లు డేరా ఆశ్రమం గురించి ఒక్కో చీకటి నిజాన్ని బయట పెడుతున్నారు. కామంతో కళ్ళు మూసుకుపోయిన డేరా బాబా చేసిన అకృత్యాలని అతడి అనుచరులే పూస గుచ్చినట్లు వివరిస్తున్నారు. తాజాగా మరో నిజం డేరా ఆశ్రమం గురించి బయట పడింది. డేరా స్వచ్ఛ సౌధలో కొంత మంది మహిళలు డేరా బాబాకు సహాయకులుగా ఉంటారని వారిని విషకన్యలుగా పిలుస్తారని తేలింది.

ఆశ్రమంలో అందమైన అమ్మాయిలు సాధ్విలుగా ఎవరు చేరినా ఆ సంచారని ముందుగా వీరు డేరా బాబా కు చేరవేస్తారు. ఆ తరువాత నెమ్మదిగా డేరా బాబా కు చేయవల్సిన సేవల గురించి తెలియజేస్తారు. డేరా బాబా వారిని చెరపట్టే సమయంలో గొడవ చేయకుండా ఉండేందుకు ముందుగానే వారిని మానసికంగా సిద్ధం చేస్తారని తేలింది. ఆ విధమైన సేవని బాబా కు చేసుకుంటే పవిత్రులు అవుతారని అంతకంటే భాగ్యం ఉండదని వారి మనసుపై ప్రభావం చూపుతారు. దానికి ప్రతి ఫలంగా అనేక ప్రలోభాలకు గురిచేస్తారు. అయినా కూడా వారు వినకుండా మొండికేస్తే చిత్రహింసలకు గురిచేస్తారట. ఎదురు తిరిగిన వారికి ఆహార పానీయాలు అందించకుండా పస్తులు ఉంచుతారు. ముఖానికి మసి పూసి గాడిదలపై ఆశ్రమం మొత్తం తిప్పుతారు. ఎలాగైనా వారు డేరా బాబా వద్దకు వెళ్లేందుకు ఒప్పుకునేలా చేస్తారు అని మాజీ జర్నలిస్ట్ గురుదాస్ పోలీస్ లకు వివరించారు.

Comments