ప్రచురణ తేదీ : Tue, Nov 1st, 2016

58 ఏళ్ల కీచకుడు.. రెండో తరగతి చిన్నారిపై అఘాయిత్యం..!

kk
హైదరాబాద్ లోని ఈ సి ఐ ల్ పరిథి లో అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్ లో దారుణం జరిగింది.58 ఏళ్ల చంద్రశేఖర్ అనే స్కూల్ పిఇటి అదే స్కూల్ కు చెందిన రెండోతరగతి చిన్నారిపై దారుణానికి ఒడి కట్టాడు.చిన్నారిని అతడు లైంగికంగా వేధించిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీనితో చిన్నారి కుటుంభం సభ్యులు అతడికి దేహశుద్ధి చేసి, అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్కూల్ ఎదుట ధర్నాకు దిగారు.

అతడు చిన్నారిని లైంగికంగా వేధిస్తుండడంతో చిన్నారి ప్రవర్తనలో మార్పు రావడం ఆమె తల్లిదండ్రులు గమనించారు.ఎక్కువగా భయపడడం గమనించిన తల్లిదంత్రులు చిన్నారిని అడగగా విషయం బయట పెట్టింది.మూడు నెలల నుంచి తనని వేధిస్తున్నాడని చిన్నారి తెలిపింది.స్థానిక పోలీస్టేషన్ లో కేసు నమోదు చేసి చంద్రశేఖర్ ను పోలీస్ లు అరెస్ట్ చేశారు.కానీ ఇంతవరకు ఈ ఘటన పై స్కూల్ యాజమాన్యం ఇంతవరకు స్పందించలేదు.

Comments