ప్రచురణ తేదీ : Wed, Dec 28th, 2016

తమిళనాడులో అన్నాడీఎంకే కార్యకర్తల రౌడీయిజం

man
జయలలిత మరణం తరువాత శశికళ పై జయలలిత కుటుంబ సభ్యులు తీవ్రంగా విరుచుకుపడ్డారు. అలాగే గౌతమి లాంటి సినీ ప్రముఖులు కూడా జయ ఆసుపత్రిలో ఉన్నపుడు ఏం జరిగిందో తెలియజేయాలని ప్రధానమంత్రికి లేఖ రాశారు. అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ పుష్ప కూడా జయలలిత మరణం తరువాత శశికళను విమర్శించారు. ఆమె జయలలిత వారసురాలు కాదని ఆమె పేర్కొన్నారు. అయితే తరువాత కొన్ని రోజులు మౌనంగా ఉన్న శశికళ పుష్ప తాజాగా మళ్ళీ వార్తలలోకి వచ్చారు.

అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యలయం వద్ద ఆ పార్టీ రెబల్ ఎంపీ శశికళ పుష్ప లాయర్లపై పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. శశికళ పుష్ప తరపు లాయర్లు పార్టీ కార్యాలయానికి వచ్చి తాము శశికళ పుష్ప తరపున వచ్చామని, ఆమె ఒక లేఖ పంపిందని అన్నారు. ఆ మాట విన్న అన్నాడీఎంకే కార్యకర్తలు అసలు శశికళ పుష్ప ఎవరంటూ వారి మీద దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు పార్టీ కార్యకర్తలను నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ దాడి నేపథ్యంలో పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.

Comments