ప్రచురణ తేదీ : Dec 7, 2017 5:13 PM IST

రివ్యూ రాజా తీన్‌మార్ : సప్తగిరి ఎల్.ఎల్.బి – క్లైమాక్స్ తప్ప ఇంకేం లేదు

తెరపై కనిపించిన వారు : సప్తగిరి, కాశిష్ వోహ్రా, సాయి కుమార్

కెప్టెన్ ఆఫ్ ‘సప్తగిరి ఎల్.ఎల్.బి’ : చరణ్ లక్కాకుల

మూల కథ :
చిత్తూరు జిల్లావాసి అయిన సప్తగిరి ఎల్.ఎల్.బి పూర్తిచేసి లాయర్ గా ఎదిగి తన మరదల్ని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశ్యంతో హైదరాబాద్ కు వచ్చి సెషన్స్ కోర్టులో ప్రాక్టీస్ పెట్టి కేసులకు ఎదురుచూస్తుంటాడు.

అలాంటి తరుణంలోనే అతను ప్రముఖ లాయర్ రాజ్ పాల్ (సాయి కుమార్) గెలిచిన ఒక యాక్సిడెంట్ కేసుపై పిల్ వేసి దాన్ని రీ ఓపెన్ చేయిస్తాడు. అసలు సప్తగిరి ఆ కేసుని ఎందుకు రీ ఓపెన్ చేయిస్తాడు, ఆ కేసు కథేంటి, పేరు మోసిన లాయర్ రాజ్ పాల్ ను సప్తగిరిని ఎలా ఢీ కొట్టాడు, చివరికి కేసు గెలిచాడా, లేదా అనేదే తెరపై నడిచే కథ.

విజిల్ పోడు :
–> హీరో సప్తగిరి డబ్బు మీద ఆశ వదులుకుని మంచివాడిగా మారి బాధితులకు న్యాయం చేయాలని సంకల్పించుకుని ప్రాణాలకు తెగించి టాప్ మోస్ట్ లాయర్ ను ఎదుర్కోవడం అనేది మెచ్చుకోదగిన అంశం. కాబట్టి దీనికి మొదటి విజిల్ వేయొచ్చు.

–> ఇక సినిమా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో వచ్చే కోర్టు సన్నివేశాలు ఎమోషనల్ గా నడుస్తూ ఆకట్టుకున్నాయి. పేదవారికి ఏమున్నా లేకపోయినా న్యాయం అనే హక్కు ఉందని తెలియజెప్పడం బాగుంది. దీనికి రెండో విజిల్ వేయొచ్చు.

–> సినిమాలో టాప్ మోస్ట్ లాయర్ గా సాయి కుమార్, జడ్జిగా శివ ప్రసాద్ ల నటన, సప్తగిరి డ్యాన్సులు బాగున్నాయి. వాటి మూడింటికీ కలిపి మూడో విజిల్ వేయొచ్చు.

ఢమ్మాల్ – డుమ్మీల్ :

–> సినిమా మొత్తంలో క్లైమాక్స్ ను మినహాయిస్తే ఎక్కడా ఆకట్టుకునే, ఉత్కంఠభరితమైన కథనం లేదు.

–> ఫస్టాఫ్, సెకండాఫ్లలో వచ్చే ఒకటి రెండు సన్నివేశాలు మినహా మిగతా మొత్తం నిదానంగా, చప్పగా నడుస్తుంది.

–> ఇద్దరు లాయర్లు తలపడుతున్నప్పుడు వారికి నడుమ ఏదైనా క్రిమినల్ మైండ్ గేమ్ ఉండటం సర్వ సాధారణం. కానీ ఇందులో అలాంటివేమీ కనబడవు. చిన్న లాయరైన హీరో చాలా సులువుగా దేశంలోని టాప్ మోస్ట్ లాయర్లలో ఒకర్ని ఇట్టే ఓడించేస్తాడు.

దేవుడా ఈ సిత్రాలు చూశారా..
–> ఈ చిత్రంలో అంతగా ఆశ్చర్యపోవాల్సిన సన్నివేశాలేవీ లేవు.

చివరగా సినిమా చూసిన ఇద్దరు స్నేహితులు ఇలా మాట్లాడుకుంటున్నారు..

–> మిస్టర్ ఏ : సప్తగిరి ఏదో ట్రై చేశాడు కానీ సరిగా వర్కవుట్ కాలేదు. ఎందుకంటావ్ ?
–> మిస్టర్ బి : క్లైమాక్స్ తప్ప ఇంకేం లేదు కనుక.
–> మిస్టర్ ఏ : అవును. మంచివని చెప్పుకోడానికి క్లైమాక్స్ తప్ప ఏం లేదు.

Comments