ప్రచురణ తేదీ : Dec 7, 2017 3:26 PM IST

హిట్టా లేక ఫట్టా : సప్తగిరి ఎల్ ఎల్ బి ట్రెండీ టాక్

ఓ వైపు కమెడియన్ గా రాణిస్తూనే మరోపైవు హీరోగా అవకాశాలు అందుకుంటున్నాడు సప్తగిరి. సప్తగిరి హీరోగా నటించిన సప్తగిరి ఎక్స్ ప్రెస్ చిత్రం ఓ మోస్తరుగా ఆడింది. మరో మారు సప్తగిరి ఎల్ ఎల్ బి ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి నేడు ప్రేక్షుకుల ముందుకు వచ్చాడు. కాగా బాలీవుడ్ చిత్రం జాలీ ఎల్ ఎల్ బి కి ఇది రీమేక్. ఈ నేపథ్యంలో సప్తగిరి ఎల్ ఎల్ బి ప్రేక్షుకులని ఆకట్టుకుందా లేదా ఇప్పుడు చూద్దాం.

ఈ చిత్రంలో సప్తగిరి లాయర్ పాత్రలో కనిపిస్తాడు. ట్రైలర్ లో చూపిన విధంగానే ఈ చిత్రంలో పాటలు, పోరాట సన్నివేశాలు అని కమర్షియల్ హంగులు ఉన్నాయ్. కానీ అవన్నీ ప్రేక్షకులని మెప్పిస్తాయా అనేదే ప్రశ్న. ఫస్ట్ హాఫ్ మొత్తం ప్రేక్షకులు గొప్పగా ఫీలయ్యే అంశాలు లేవు. సెకండ్ హాఫ్ చివర్లో మాత్రం సప్తగిరి, సాయి కుమార్ మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. సప్తగిరిని మాస్ హీరోలా చూపించడానికి ఫైట్లతో చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. సప్తగిరి పెర్ఫామెన్స్, సాయికుమార్ నటన మాత్రమే ఈ చిత్రంలో చెప్పుకోదగ్గ అంశాలు.

 

ఫినిషింగ్ మాత్రం బాగుంది

Reviewed By 123telugu.com |Rating : 2.75/5

ట్రాక్‌ తప్పిన రీమేక్‌!

Reviewed By greatandhra.com |Rating : 2/5

బ్యాడ్ రీమేక్

Reviewed By gulte.com |Rating : 2.5/5

సప్తగిరి ఎల్ ఎల్ బీ.. మంచి కథకు మసాలా పులిమేశారు

Reviewed By tupaki.com |Rating : 2/5

తెలుగు నేటివిటీ కథని చంపేసింది

Reviewed By mirchi9.com |Rating : 2.25/5 

<

Comments