ప్రచురణ తేదీ : Mon, Jan 9th, 2017

హైదరాబాద్ బిర్యానీ ఫ్రెష్ అనుకుంటున్నారా..?

chicken-biriyani
హైదరాబాద్ బిర్యాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.సామాన్య ప్రజల నుంచి స్టార్స్ వరకు అందరికి హైదరాబాద్ బిర్యానీ అంటే మక్కువే. దీనితో హైదరాబాద్ లోని ఏ రెస్టారెంట్ కు వెళ్లినా ఘుమ ఘుమ లాడే బిర్యానీ దర్శనమిస్తుంది. కాగా గతంలో హైదరాబాద్ బిర్యానీ తయారీలో అనేక లొసుగులు బయట పడిన విషయం తెలిసిందే. జంతు మాంసాలతో తయారు చేసిన నూనెతో పలు రెస్టారెంట్లు బిర్యానీ తయారు చేస్తూ అధికారుల తనిఖీల్లో చిక్కారు. కానీ అధికారులు తాజాగా జరిపిన తనిఖీల్లో మరో విషయం బయట పడింది.ఇలా కూడా బిర్యానీని చేస్తున్నారని తెలిసిస్తే రెస్టారెంట్లకు వెళ్లి బిర్యానీని తినడం కష్టమే.

హైదరాబాద్ లోని 500 పైగా రెస్టారెంట్లపై సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సానిటరీ వింగ్ ఆధ్వర్యంలో తనిఖీలు జరిగాయి.ఈ తనిఖీల్లో పలు రెస్టారెంట్లు ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి బిర్యానీ చేస్తున్నట్లు తేలింది.10 రోజుల క్రితమే మాంసాన్ని భారీ ఎత్తున కొనుగోలు చేసి వాటిని ఫ్రిజ్ లలో నిల్వఉంచి, దానితో తయారైన బిర్యానీని రోజూ వడ్డిస్తున్నారు. సికింద్రాబాద్ లోని తిరుమల గిరి ప్రాంతం లో షాహి బిర్యానీ దర్బార్ అనే ఫేమస్ రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్ లో తనిఖీలు నిర్వహించగా బిర్యానీ తయారు చేయడానికి నిల్వ ఉంచిన మామాసం లో ఫంగస్ చేరినట్లు అధికారులు గుర్తించారు. ఆ రెస్టారెంట్ యజమాని తక్కువధరకు వస్తుండడంతో బల్క్ గా మాసాన్ని కొనుగోలు చేసి 10 రోజుల పాటు ఫ్రీజ్ లో నిల్వఉంచుతున్నారు. ఫ్రిజ్ ని ఓపెన్ చేసి చూడగా తీవ్రమైన దుర్వాసన వచ్చినట్లు సానిటరీ వింగ్ ఆఫీసర్ దేవేందర్ తెలిపారు. నగరం లోని పలు రెస్టారెంట్లు ఇదే పద్దతిని ఫాలో అవుతున్నాయని, ఇలాంటి వంటకాలు తింటే ప్రజలు అనారోగ్య పాలు కావడం ఖాయమని అంటున్నారు.

Comments