ప్రచురణ తేదీ : Fri, Apr 27th, 2018

హీరోయిన్ తో బైక్ మీద చక్కర్లు కొడుతున్న సల్లు భాయ్

బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ ప్ర‌స్తుతం రెమో డిసౌజా ద‌ర్శ‌క‌త్వంలో రేస్ 3 చిత్రాన్ని చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈద్ సంద‌ర్భంగా జూన్ 15న విడుద‌ల కానున్న ఈ మూవీ చిత్రీక‌ర‌ణ దాదాపు పూర్తైంది. ఒక్క సాంగ్ మాత్ర‌మే బ్యాలెన్స్ ఉండ‌గా, ఆ సాంగ్‌ని చిత్రీక‌రించేందుకు స‌ల్మాన్ అండ్ టీం క‌శ్మీర్‌కి వెళ్లింది. శ్రీనగర్ ప్రాంతంలోని సోనామార్గ్ హిల్ స్టేషనులో రెండురోజుల పాటు షూటింగ్ జ‌రిపారు. ఆ త‌ర్వాత‌ జ‌మ్ము కశ్మీర్ ముఖ్య‌మంత్రి మెహ‌బూబా మ‌ఫ్తీని క‌లిసారు. స‌ల్మాన్ బృందానికి సాద‌ర స్వాగ‌తం ప‌లకిన మెహ‌బూబా వారితో గంట‌సేపు చ‌ర్చించారు. అయితే షూటింగ్ త‌ర్వాత స‌ల్మాన్ ఖాన్ మ‌రియు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ అంద‌మైన లొకేష‌న్స్‌లో చ‌క్క‌ర్లు కొట్టారు.

హీరోయిన్‌ని బైక్‌పై ఎక్కించుకొని స‌ల్మాన్ షికార్లు కొట్టాడు. వీటికి సంబంధించిన వీడియోలని జాక్వలైన్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయ‌డంతో వైర‌ల్ అయ్యాయి. అభిమానులు కూడా త‌మ సోష‌ల్ మీడియా పేజ్‌ల‌లోను ఈ వీడియోల‌ని షేర్ చేస్తున్నారు. భ‌జ‌రంగీ భాయిజాన్ చిత్ర షూటింగ్ స‌మ‌యంలో క‌శ్మీర్ వెళ్లిన స‌ల్మాన్ మ‌ళ్లీ మూడేళ్ళ త‌ర్వాత రేస్ 3 షూటింగ్ కోసం అక్క‌డికి వెళ్ళాడు. రేస్ 3 చిత్రంలో బాబీ డియోల్‌, సాఖిబ్‌ సలీం, అనిల్‌ కపూర్‌, డైసీ షాలు ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్ర షూటింగ్ త‌ర్వాత స‌ల్మాన్ ఖాన్.. అలీ అబ్బాస్ జాఫ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో భ‌ర‌త్ అనే సినిమా చేయ‌నున్నాడు. 2019 ఈద్ కానుక‌గా విడుద‌ల కానున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా క‌థానాయిక‌గా న‌టించ‌నుంది. ఈ మూవీ త‌ర్వాత కిక్2, ద‌బాంగ్ 3 చిత్రాలు కూడా చేయ‌నున్నాడు స‌ల్మాన్‌.

Comments