ప్రచురణ తేదీ : Dec 6, 2017 1:50 AM IST

నితిన్, దిల్ రాజుకు సాయి పల్లవి షాక్..చివరకు బన్నీ హీరోయిన్ తో..!

దిల్ చిత్రం తరువాత నితిన్, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కాంబినేషన్లో రాబోతున్న చిత్రం శ్రీనివాసకల్యాణం. శతమానం భవతి ఫేమ్ సతీష్ దర్శకత్వంలో ఈ చిత్రం రాబోతోంది. కాగా ఈ చిత్రానికి అప్పుడే ప్రి ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలైపోయాయి. చిత్ర నిర్మాణం విషయంలో రాజు గారి ప్లాన్ పకడ్బందీగా ఉంటుంది. శ్రీనివాస కళ్యాణం టైటిల్ ద్వారా ఇదో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అనే విషయం అర్థం అవుతోంది. ఫిదా చిత్రంతో సాయి పల్లవి అటు ఫ్యామిలీ ఆడియన్స్ ని, ఇటు తెలుగు కుర్రాళ్ళని మాయ చేసేసింది. అందుకేనేమో దిల్ రాజు నిర్మాణంలో వరుసగా రెండో చిత్రంలో నటించే ఛాన్స్ కొట్టేసింది ఈ మలయాళీ బ్యూటీ.

కానీ అదే బ్యానర్ నుంచి హ్యాట్రిక్ ఆఫర్ కూడా వచ్చిందట. కానీ సాయి పల్లవి దిల్ రాజు కు సింపుల్ గా సారి చెప్పి షాక్ ఇచ్చిందట. శ్రీనివాస కల్యాణంలో హీరోయిన్ ఛాన్స్ ని వదులుకునట్లు తెలుస్తోంది. ఇక చేసేది ఏమిలేక మరో హీరోయిన్ వేటలో దిల్ రాజు ఉన్నారట. పూజా హెగ్డేని ని నితిన్ కు జోడిగా ఫైనల్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. చిత్ర యూనిట్ ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారట.

Comments