ప్రచురణ తేదీ : Jun 11, 2018 5:50 PM IST

అయ్యో సాయి మళ్లీ వాయిదానా?

గత కొంత కాలంగా వరుస పరాజయాలతో సతమతమవుతున్న హీరో సాయి ధరమ్ తేజ్. వరుసగా అయిదు డిజాస్టర్స్ రావడంతో మెగాస్టార్ రంగంలోకి దిగారు.
మేనల్లుడి స్టార్ డమ్ తగ్గకుండా తనవంతు ప్రయత్నం చేయాలనీ చేస్తున్నాడు. ఇప్పటికే తేజ్ ఐ లవ్ యూ సినిమా ఆడియో వేడుకను గ్రాండ్ చేసి సినిమాకు హైప్ క్రియేట్ చేశారు. ఇక ఈ సారి ఎలాగైనా హిట్ కరుణాకరన్ హిట్ ఇస్తారని తేజ్ నమ్మకంతో ఉన్నాడు.

ఇకపోతే ప్రస్తుతం ఆ సినిమాను వాయిదా వేశారు. జూన్ 29న రిలీజ్ చెయ్యాలని ముందు అనుకున్నారు. కానీ సడన్ గా బజ్ లేకపోవడంతోనో లేక ఇతర కారణాల వల్లనో తెలియదు గాని మొత్తానికి వాయిదా వేస్తున్నట్లు చెప్పేశారు. జూన్ 6న రిలీజ్ అని కొత్త డేట్ ఫిక్స్ అయ్యింది. మరి ఈ సినిమా ఎంతవరకు విజయం అందుకుంటుందో గాని ఫ్లాప్ అయితే మాత్రం సాయి కెరీర్ కష్టాల్లో పడినట్లే.చూడాలి మరి ఏం జరుగుతుందో..

Comments