ప్రచురణ తేదీ : Jun 2, 2018 10:54 AM IST

మామయ్య మాట ఒక ఆదేశం.. ఆయన చెబితే చేస్తా: సాయి ధరమ్ తేజ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తనదైన శైలిలో ప్రచారాలను చేసుకుంటూ ముందుకు వెళుతున్న సంగతి తెలిసిందే. జనల మధ్యలోకి వెళుతూ అధికార పక్ష నేతలపై ఫైర్ అవుతున్నారు. రోజు రోజుకి పవన్ తన మాటలతో రాజకీయ వేడిని రేపుతున్నారు. అయితే పవన్ ఒక్కడే ఆ విధంగా వెళుతుండడంతో ఆయన వెనకాల ఎవరు లేరనే కామెంట్స్ వస్తున్నాయి. అయితే పవన్ మాత్రం ప్రతి గ్రామంలో తన బలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

కుటుంబ సభ్యుల ప్రస్తావన వచ్చినప్పుడు పవన్ పెద్దగా దానిపై స్పందించడం లేదు. వారు ఇష్టపడి వస్తే తాను వద్దననని చెప్పిన పవన్ ఒకటికి పదిసార్లు ఆలోచించుకొమ్మని తాను చెబుతాను అని కూడా తెలిపారు. ఇక రీసెంట్ గా సాయి ధరమ్ తేజ్ మామయ్య ఆర్డర్ వేస్తె డౌట్ లేకుండా ఎలక్షన్స్ లో ప్రచారం చేయడానికి తాను సిద్ధమని చెప్పాడు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఓ కార్యక్రమం కోసం వెళ్లిన సాయి ధరమ్ తేజ్ మీడియాతో మాట్లాడాడు. పవన్ మాట ఆదేశం లాంటిదని ఒక్క మాట చెప్పినా కూడా తాను ప్రచారంలో పాల్గొంటాను అని సాయి వివరించాడు. అలాగే తన నెక్స్ట్ ఫిల్మ్ తేజ్ ఐ లవ్ యు సినిమా ఈ నెల 29న రిలీజ్ కానున్నట్లు సాయి వివరించాడు.

Comments