ప్రచురణ తేదీ : Fri, Sep 11th, 2015

ఆమెకు వ్యతిరేకంగా గ్రామం మొత్తం సహాయనిరాకరణ..!

girl
ఓ మహిళపై గ్రామప్రజలు సహాయనిరాకరణను చేస్తున్నారు. ఎవరు ఆమెతో మాట్లాడటం కాని, సహాయం చేయడం కాని చేయకూడదని గ్రామపెద్దలు తీర్పు చెప్పారు. ఎవరైనా ఆమెతో మాట్లాడిన, సహాయం చేసినా మూడు వేల రూపాయల జరిమానా విధిస్తామని పేర్కొన్నారు. అసలు ఎందుకు ఆమెపై గ్రామస్తులు అంత కోపంగా ఉన్నారో తెలుసుకుందాం.

చిత్తూరు జిల్లాలోని తవణంపల్లె మండలంలోని గోవిందరెడ్డి పల్లె దళితవాడకు చెందిన ఓ మహిళ 2004 వ సంవత్సరంలో రోడ్డుకు ఆనుకొని ఉన్న 13 సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేసింది. అయితే, 2007లో గ్రామంలోని పశువుల కోసం ఆమె స్థలం పక్కనే ప్రభుత్వం నీటి తొట్టిని ఏర్పాటు చేసింది. అయితే, ఈ నీటితొట్టి దగ్గర పశువులకు నీళ్ళతో పాటు, గ్రామస్తులు బట్టలు కూడా ఉతుక్కోవడం మొదలుపెట్టారు. అయితే, ఇలా బట్టలు ఉతుక్కోవడంతో.. నీరు ఆమె స్థలంలోకి వెళ్తున్నది. దీంతో అక్కడ బట్టలు ఉతుక్కోవద్దని వాళ్ళని వారించింది. తన స్థలంలోకి నీళ్ళు వస్తున్నాయని, తాను అక్కడ ఇల్లుకట్టుకోవాలని అనుకుంటున్నట్టు ఆమె గ్రామస్తులతో తెలిపింది.

అయితే, గ్రామస్తులు గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేయడంతో ఆమెపై సహాయనిరాకరణ చేయాలని పెద్దలు తీర్పు చెప్పారు. కాగ, ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Comments